పంజాబీ సింగర్ దారుణ హత్య

పంజాబీ సింగర్ దారుణ హత్య
పంజాబీ సింగర్ సిద్దు మూసెవాల దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం పంజాబ్‌లోని జవహర్కే అనే గ్రామంలో సిద్ధూని గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పంజాబ్‌లోని 424 మందికి భద్రత తొలగించిన మర్నాడే ఈ హత్య జరగడం గమనార్హం. పైగా సింగర్ సిద్ధూ మొన్న జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో( కాంగ్రెస్  పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.
 
కాగా, ఆప్ అభ్యర్థి విజయ్ సింగ్లా చేతిలో 63,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. విజయ్ సింగ్లాను కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణలతో మంత్రి వర్గం నుంచి భగవంత్ మాన్ ప్రభుత్వం తొలగించింది. గత నెలలో సిద్ధూ రూపొందించిన స్కేప్‌గోట్  అనే పాట వల్ల సిద్ధూ మద్దతుదారులు ఆప్ కార్యకర్తల మధ్య తీవ్ర వివాదం తలెత్తింది.
ఆప్ మద్దతుదారులను ద్రోహులు అంటూ తన పాటలో సిద్ధూ ప్రస్తావించడం ఈ వివాదానికి దారి తీసింది. సిద్ధూ 1993 జూన్‌ 17న మాన్సా జిల్లాలోని మూసెవాలలో జన్మించారు. మంచి రాపర్ అయిన సిద్ధూకి మిలియన్ల సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులు ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ డిగ్రీ చేస్తున్న సమయంలోనే సిద్ధూ సంగీతం నేర్చుకున్నారు.
అనంతరం పై చదువుల కోసం కెనడాకు వెళ్లాపోయారు. పంజాబ్‌లోని అత్యంత వివాదాస్ప సింగర్లలో సిద్ధూ ఒకరు. గ్యాంగ్‌స్టర్లను పొగడడం, గన్ కల్చర్‌ను ప్రమోట్ చేయడం లాంటివి సిద్ధూ అనేకం చేశారు. 2019 సెప్టెంబర్‌లో వచ్చిన ‘జట్టి జోనె మోర్హ్ ది బందూక వార్గి’ అనే పాట తీవ్ర వివాదమైంది. 18వ శతాబ్దపు సిక్కు వీరుడు మై భాగోపై రాసిని పాట ఇది. అయితే ఈ పాట రాసి పాడినందుకు సిద్ధూ క్షమాపణ చెప్పారు.