రాజ్యసభ ఎన్నికలలో నిర్మలా, పీయూష్ 

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ లతో పాటు 16 మందిని బిజెపి రాజ్యసభ ఎన్నికలలో పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. 57 స్థానాలకు జూన్ 10న ఎన్నికలు జరుగనున్నాయి. క‌ర్నాట‌క నుంచి నిర్మ‌లా సీతారామ‌న్‌, మ‌హారాష్ట్ర నుంచి పీయూష్ గోయ‌ల్‌ తిరిగి పోటీచేయనున్నారు. 
మధ్యప్రదేశ్ నుండి కవితా పాటిదర్; కర్ణాటక నుండి నిర్మలా సీతారామన్, జగ్గేష్, మహారాష్ట్ర నుండి పీయూష్ గోయల్,   అనిల్ సుఖ్దేవ్రావు, రాజస్థాన్ నుండి  ఘణ్శ్యామ్ తివారీ, ఉత్తర ప్రదేశ్ నుండి  లక్ష్మికాంత్ వాజ్పేయి,  రాధామోహన్ అగర్వాల్,  సురేంద్ర సింగ్,  బహురాం నిశాద్,,  దర్శణ్ సింగ్,  సంగీతా యాదవ్; ఉత్తరాఖండ్ నుండి      కల్పనా సైనీ, బీహార్ నుండి సతీష్ చంద్ర దూబే,  శంభూశరణ్ పాటిల్, హర్యానా నుండి  క్రిష్ణలాల్ పవార్.
చిదంబరంతో సహా 10 మందితో కాంగ్రెస్ జాబితా 
 
కాగా,  మొత్తం పది మంది పేర్లతో జాబితాను కాంగ్రెస్ సోమవారం ఉదయం ప్రకటించింది. కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరానికి అవకాశం కల్పించారు. ఈయన్ను తమిళనాడు నుంచి రంగంలోకి దించింది. కర్నాటక రాష్ట్రం నుంచి జైరాం రమేశ్ ను తిరిగి బరిలోకి దింపింది. వీరిద్దరూ సొంత రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్నారు. 
 
పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సూర్జేవాలా, ప్రధాన కార్యదర్శి ముకుల్​ వాస్నిక్, హర్యాణా నుంచి అజయ్ మకెన్, మహారాష్ట్ర నుంచి ఇమ్రాన్ ప్రతాప్​ గర్హి, రాజస్థాన్ నుంచి ఉత్తరప్రదేశ్ నేత ప్రమోద్ తివారీ, బీహార్ రాష్ట్రం నుంచి మాజీ ఎంపీ పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్, మధ్యప్రదేశ్ నుంచి వివేక్ బంకా, ఛత్తీస్ గఢ్ నుంచి రాజీవ్ శుక్లాలను బరిలోకి దింపింది.
 

అయితే,  సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలకు  ఇందులో చోటు కల్పించకపోవడం గమనార్హం. పార్టీలో సంస్థాగతంగా సమూల మార్పులు చేయాలంటూ 2020లో అధ్యక్షురాలు సోనియా గాంధీకి 23 మంది నేతలు లేఖ రాసిన వారిలో వీరిద్దరూ కీలకంగా వ్యవహరించారు.

కాగా, ఆ లేఖలో సంతకాలు చేసిన ముకుల్ వాస్నిక్, వివేక్ టంకాలకు రాజ్యసభ అవకాశం కల్పించడం గమనార్హం. రాజస్థాన్ నుంచి సీట్లు ఇచ్చిన ముగ్గురిలో ఒకరు కూడా స్థానికులు లేకపోవడం గమనార్హం.