సంజయ్ రౌత్ పై రూ.100 కోట్ల పరువు నష్టం దావా

రూ 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ బీజేపీ నేత కిరీట్ సోమయ్య భార్య మేధా శివసేన నాయకుడు సంజయ్ రౌత్‌పై బాంబే హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా ఉన్న మేధా, రౌత్‌కు వ్యతిరేకంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని,  భవిష్యత్తులో తనకు పరువు నష్టం కలిగించే విషయాలను ప్రచురించడం, ప్రసారం చేయడం లేదా ముద్రించడం వంటి వాటిని నిరోధించాలని కోరింది.

ఏప్రిల్ 12న కోర్టు ముందు ఆమె చేసిన అభ్యర్థన మేరకు, మీరా-భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రాంతంలో పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణంలో మేధా కిరీట్ సోమయ్య , ఆమె భర్త కిరీట్ సోమయ్య  రూ.  100 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని రౌత్ శివసేన
 వార్తాపత్రిక ‘సామ్నా’లో వ్రాసిన కధనంలో ఆరోపించారని ఆమె పేర్కొన్నారు.
 ‘సామ్నా’లో కథనం ప్రచురించిన తర్వాత కథనంలో వచ్చిన ఆరోపణలు రుజువు లేకుండా , తన ప్రతిష్టను దిగజార్చే ఉద్దేశ్యంతో ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. “దరఖాస్తుదారు డాక్టరేట్ , సమాజంలో, ఆమె వృత్తిలో ఉన్నత ఖ్యాతిని కలిగి ఉన్నారు. సమాజంలో, సాధారణ ప్రజల దృష్టిలో, శ్రేయోభిలాషులు మొదలైన వారి దృష్టిలో ఆమె స్థాయిని తగ్గించడం ద్వారా ఈ పరువు నష్టం కలిగించే అంశాలు ఆమెను బాధించాయి, ” అని ఆమె వేసిన దావా పేర్కొంది.
 
ముఖ్యమంత్రి సహాయనిధికి జమ చేసేందుకు రూ.100 కోట్ల మేరకు నష్టపరిహారాన్ని రికవరీ చేసేందుకు తనకు అర్హత ఉందని ఆమె తెలిపారు. మేధా గత నెలలో రౌత్‌కు నోటీసు పంపారు.  క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ములుండ్ పోలీసులను కూడా ఆమె ఆశ్రయించారు.