మదర్సాలు అన్నీ కూడా జాతీయ గీతం ఆలపించడాన్ని ఇటీవలే తప్పనిసరి చేసిన ఉత్తర ప్రదేశ్ లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకోండి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మదర్సాలకు ప్రభుత్వం నుండి ఇక ఎటువంటి నిధులు ఇవ్వరాదని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దానితో రాష్ట్రంలోని మదర్సాలకు ఇక దాదాపుగా ప్రభుత్వ నిధులు అందే అవకాశం లేకుండా పోయింది.
మదర్సాల్లో తరగతులు ఆరంభానికి ముందు విద్యార్థులు, టీచర్లు అందరూ జాతీయగీతం ఆలపించాలంటూ మైనారిటీ శాఖ ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఇచ్చిన వారం వ్యవధిలోనే.. కొత్త మదర్సాలను ప్రభుత్వ నిధుల సాయం నుంచి మినహాయిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
రాష్ట్ర ప్రభుత్వం నిధుల సాయం నుంచి కొత్త సంస్థలనే మినహాయించారు. యూపీ ప్రభుత్వం మదర్సాల ఆధునికీకరణ పథకానికి గత బడ్జెట్ లో రూ.479 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధులతో మదర్సాలను ఆధునికీకరించనున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 16 వేలకు పైగానే మదర్సాలు ఉన్నాయి. కానీ, వాటిలో 558 మదర్సాలకు మాత్రమే ప్రభుత్వం నిధులను అందించనుంది. దీంతో మిగిలిన వేలాది మదర్సాలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధుల సాయం అందదు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!
భారత అంతరిక్ష రంగం 2025లో అద్భుత పురోగతి