బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌కి మరోసారి కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ట్విట్టర్ ద్వారా చెప్పారు. ‘కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 కోసం ఎంతో ఎదురు చూశా, కానీకరోనా పాజిటివ్ రావడంతో ఈవెంట్‌లో పాల్గొనలేకపోతున్నా. టీం అందరికీ శుభాంకాంక్షలు’ అంటూ ట్వీట్ చేశారు.
గతేడాది ఏప్రిల్‌లోనూ అక్షయ్ కుమార్ కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతానికి తనకు కరోనా స్వల్ప లక్షణాలు ఉన్నాయని, విశ్రాంతి తీసుకుని త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తానంటూ ట్విట్టర్ లో తెలిపారు. తాజాగా మరోసారి కరోనా పాజిటివ్ అని తేలడంతో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరంగా ఉండనున్నారు.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ మరికొన్ని రోజుల్లో ఫ్రాన్స్ లో ప్రారంభం కానుంది. బాలీవుడ్, దక్షిణాది పరిశ్రమలకు చెందిన పలువురు స్టార్ హీరో, హీరోయిన్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ఈ ఏడాది భారత్ తరపున ‘కేన్స్’లో సందడి చేయనున్నారు. నయనతార, తమన్నా, ఏఆర్ రెహమాన్, ఆర్ మాధవన్ సహా పలువురు సెలబ్రిటీలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ రెడ్ కార్పేట్‌పై నడవనున్నారు.

More Stories
బీహార్ లో ఏకపక్షంగా 200 సీట్ల వైపు ఎన్డీయే ప్రభంజనం
భారీ ఉగ్రకుట్ర భగ్నం చేసిన ఐపీఎస్ జీవీ సందీప్ చక్రవర్తి
షాహీన్‌కు పుల్వామా దాడి సూత్రధారి భార్యతో సంబంధాలు!