ట్రంప్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ వినియోగదారుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని భారత ఐటి శాఖ సహాయక మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఖాతా పునరుద్ధరణ చట్ట ప్రకారం జరగాలని, ఏకపక్షంగా జరగకూడదని ఆయన స్పష్టం చేశారు. 
అమెరికా మాజీ ప్రధాని ట్రంప్ ట్విటర్ ఖాతాను పునరుద్ధరిస్తామంటూ ఎలన్ మస్క్ ప్రకటనకు ట్విటర్ మాజీ ఛీప్ జాక్ డోర్సే కూడా మద్దతు తెలిపారు. మే 10వ తేదీన జరిగిన ఫైనాన్షియల్ టైమ్స్ ఈవెంట్లో టెస్లా అధినేత ఎలన్ మస్క్ మాట్లాడుతూ ట్విటర్‌ను కొనుగోలు చేస్తే ట్రంప్‌పై నిషేధాన్ని వెనక్కుతీసుకుంటానని పేర్కొన్నారు.
  ట్రంప్‌పై ట్విట్టర్ నిషేధాన్ని ‘నైతికంగా చెడ్డ నిర్ణయం’, ‘తీవ్రమైన మూర్ఘత్వం’గా వర్ణించారు. ‘ఈ నిషేధం పొరబాటు అని నేను భావిస్తున్నాను. నిషేధంతో ట్విట్టర్లో ట్రంప్ స్వరం వినిపించకుండాపోయింది’ అని పేర్కొన్నారు. చట్టవిరుద్ధమైన లేదా అలాంటి కంటెంట్ విషయంలో తాత్కాలిక సస్పెన్షన్లు, స్వల్ప శిక్షలను తాను ఇష్టపడతానని ఆయన చెప్పారు.   ఇటీవల 44 బిలియన్ డాలర్లకు ట్విటర్‌ను కొనుగోలు చేస్తానంటూ మస్క్ భారీ ఆఫర్‌ను ప్రకటించారు. 
కాగా, గతేడాది జనవరి 6న అమెరికా క్యాపిటల్ భవనంపై జరిగిన హింసాత్మక దాడి ఘటనలో 150 మంది భద్రతా అధికారులు గాయపడగా, ఇద్దరు మరణించారు. ఈ ఘటనలో హింసను రెచ్చగొట్టడంలో ట్రంప్ ప్రమేయం ఉన్నందున ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వతంగా నిలిపివేసింది.  మరోవైపు తనపై నిషేధాన్ని ఎత్తివేసినా ట్విట్టర్లో మళ్లీ చేరనని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. తన సొంత ఫ్లాట్‌ఫారమ్ ట్రూత్ సోషల్‌పై దృష్టి పెడతానని చెబుతున్నారు.
                            
                        
	                    
More Stories
హిందూజా గ్రూప్ చైర్మన్ గోపీచంద్ మృతి
సుప్రీంకోర్టులో ట్రంప్ టారీప్లపై భారత సంతతి లాయర్ సవాల్
74 శాతం భారతీయ విద్యార్థులను తిరస్కరించిన కెనడా