
మార్చినెలలో 18.05 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. తన నెలవారీ నివేదిక ద్వారా వాట్సాప్ ఈ విషయాన్ని వెల్లడించింది.
ఫిర్యాదుల విభాగం ద్వారా వినియోగదారులు చేసిన ఫిర్యాదుల ఆధారంగానూ, నిబంధనల ఉల్లంఘనలను నిరోధించడానికి, గుర్తించడానికి తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న యంత్రాంగం ఆధారంగానూ ఈ నిషేధం విధించినట్లు వాట్సాప్ స్పష్టం చేసింది.
గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన నూతన ఐటి నిబంధనల ప్రకారం భారీ డిజిటల్ ఫ్లాట్‌ఫార్మ్స్ (50 లక్షలకు పైగా వినియోగ దారులు ఉన్నవి) తప్పనిసరిగా ప్రతినెలా నివేదికను వెల్లడించాలి. వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై పూర్తి వివరాలను తెలపాలి.
ఈ ఏడాది మార్చి 1 నుంచి 31 వరకూ 18.05 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు వాట్సాప్ తన నివేదికలో తెలిపింది. వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నట్లు వాట్సాప్ పేర్కొంది. ఫిబ్రవరి నెలలో 14.26 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది.
More Stories
త్వరలో దేశవ్యాప్తంగా ‘సర్’
అయోధ్య సమీపంలో భారీ పేలుడు – ఐదుగురు మృతి
జార్ఖండ్లో గత పదేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షపాతం