దేశ రాజధాని ‘ఇంద్రప్రస్థ’ పేరు పెట్టాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలను అఖిల భారత్ హిందూ మహాసభ, సంత్ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ కోరారు. తమ సంస్థ ఈ విషయంలో సంతకాల ఉద్యమాన్ని చేపట్టగలదని వెల్లడించారు.
‘ఢిల్లీ అనేది కొత్త పేరు, కానీ మహాభారతం కాలం నుంచే దానికి `ఇంద్రప్రస్థ’ అన్న పేరుంది’ అని చక్రపాణి తెలిపారు. ‘తోమర్ కాలంలో ఓ రాజు ఓ ఇనుప కడ్డీని నాటారు. అది వదులుగా (డీలిగా) ఉండింది. దాంతో తర్వాత ఆ ప్రాంతానికి ‘ఢిల్లీ’ అన్న పేరు స్థిరపడింది’ అని దాని పూర్వోత్తర కథనాన్ని ఆయన తెలిపారు.
‘ఇంద్రప్రస్థ అంటే ప్రభువు ఇంద్రుడి రాజ్యం. అక్కడ అందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు అని అర్థం’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. కాగా, ఇంతకు ముందే మొత్తం 40 ప్రదేశాలకు పునఃనామకరణం చేయాలని కోరుతూ బిజెపి ఢిల్లీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌లకు ఆయన లేఖలు వ్రాసారు.

More Stories
10వ సారి సీఎంగా నీతీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించలేం
ప్రకృతి వ్యవసాయంలో గ్లోబల్ హబ్ గా భారత్