రాహుల్ “చునావి (ఎన్నికల) హిందూ” …  బిజెపి ఎద్దేవా 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  “చునావి హిందూ” (ఎన్నికల ప్రయోజనాల కోసం హిందూ) అని,  కేవలం హిందువుగా నటిస్తున్నారని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర ఎద్దేవా చేశారు.  రాహుల్ గాంధీ శ్రీరాముడి ఉనికిని ప్రశ్నిస్తున్నారని పేర్కొంటూ  అతనితో పాటు,  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేల  “సముచిత రాజకీయాలు”,  వారి “ప్రేరేపిత” వ్యాఖ్యల కారణంగా శ్రీరామ నవమి ఉరేగింపుల సందర్భంగా పలు రాష్ట్రాలలో హింస చెలరేగిందని ఆరోపించారు.
రాహుల్ ఇటీవల ఓ బహిరంగ సభలో పేరుచెప్పని ఒక బిజెపి నాయకుడిని ఉటంకిస్తూ తనకు పునర్జన్మ మీద నమ్మకంలేదన్నారని పేర్కొంటూ అతనికి పునర్జన్మపై నమ్మకం లేకపోతే, అతను రాముడిని ఎలా నమ్ముతాడని ప్రశ్నించారు.
తన ప్రసంగంలో, గుజరాత్‌లోని ఉనాలో దళితులపై హింస తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించిన దళిత యువకుడితో జరిపిన  తన సంభాషణను ప్రస్తావిస్తూ  “నా సోదరిపై దాడి జరిగి ఉంటే, నేను చనిపోయే ముందు ఆమెను హింసించే వ్యక్తిని కత్తితో పొడిచి చంపి ఉండేవాడిని” అన్నారని సంబిత్ పాత్ర విస్మయం వ్యక్తం చేశారు.  గాంధీకి రాజ్యాంగంపైనా, న్యాయవ్యవస్థపైనా విశ్వాసం లేదని దీన్నిబట్టి స్పష్టం అవుతుందని ఆయన ధ్వజమెత్తారు.
తాను అధికారం మధ్యలో పుట్టినప్పటికీ తనకు అధికారంపై ఆసక్తి లేదని గాంధీ చెప్పడాన్ని బిజెపి ప్రతినిధి ప్రస్తావిస్తూ, ప్రజలను “రెచ్చగొట్టడం”, శ్రీరాముడి   ఉనికిని “ప్రశ్నించడం” లక్ష్యంగా ఈ వ్యాఖ్యలు అతని నిరాశను వ్యక్తం చేస్తున్నారని విమర్శించారు.  అధికారం కోసం గాంధీ కుటుంబం ఎంతకైనా తెగించవచ్చని ఆయన ఆరోపించారు.
‘కొందరు నేతలు రాముడి ఉనికిని ప్రశ్నిస్తూ ప్రజలను రెచ్చగొడుతున్న తీరు.. ఇలా జరగాల్సింది కాదు.. భారత్‌లో రాముడిపై ప్రజలకు విశ్వాసం ఉండటాన్ని రాహుల్ గాంధీ తట్టుకోలేకపోతున్నారు. ,”  అని విచారం వ్యక్తం చేశారు. .
గాంధీని తమ పార్టీ “జానేయు-ధారి హిందువు”గా అభివర్ణించిందని చెబుతూ  శ్రీరాముడి ఉనికిపై దాడి చేయడం ద్వారా కాంగ్రెస్ నాయకుడు ఎన్నికల కోసం హిందువుగా నటించే వ్యక్తిగా తనను తాను చూపించుకున్నారని ఎద్దేవా చేశారు.  శ్రీ రాముడి ఉనికికి ఎలాంటి రుజువు లేదని యూపీఏ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అఫిడవిట్‌లో పేర్కొన్నదని ఆయన గుర్తు చేశారు.
 రాహుల్ గాంధీ తన తల్లి, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ మార్గంలోనే నడుస్తున్నారని సంబిత్ పాత్ర మండిపడ్డారు.  దీని వల్ల ప్రజలు ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని తుదముట్టించారని పేర్కొంటూ  ప్రతిపక్ష పార్టీకి మళ్లీ గుణపాఠం చెబుతారని స్పష్టం చేశారు.  ఈ సందర్భంలో, రాముడు పుట్టకపోతే అధికార పార్టీ ఏ సమస్యను లేవనెత్తుతుందని బిజెపిపై ఠాక్రే ఎగతాళి చేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.
బీజేపీపై దాడి చేసేందుకు ప్రతిపక్ష నేతలు వేల కారణాలను వెతుక్కోవచ్చు కానీ ఇది చిల్లర రాజకీయం అని ఆయన హితవు చెప్పారు. రామనవమి ఊరేగింపుల సందర్భంగా అనేక రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనలను ప్రస్తావిస్తూ, గాంధీ, ఠాక్రే వంటి సీనియర్ నేతలు తమ బుజ్జగింపు రాజకీయాల కారణంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సహజమేనని ధ్వమజెత్తారు.