యాసంగి వరిని తక్షణమే కొనుగోలు చేయాలని ఢిల్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌హైదరాబాద్ లో ఒక రోజు దీక్ష చేపట్టింది. సోమవారం ఉదయం 10 గంటలకు ఇందిరా పార్కు వద్ద చేపట్టనున్న ఈ ఆందోళనకు కేంద్ర మంత్రి వి. మురళీధరన్ హాజరవుతారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేఎల్పీ నేత రాజాసింగ్ తదితరులు పాల్గొంటారు.
కాగా, ఢిల్లీలో నిరసనల పేరిట సీఎం కేసీఆర్ రాజకీయ డ్రామాలాడుతున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. వడ్లు కొంటామని కేంద్రం పదే పదే స్పష్టం చేస్తున్నా, ఎందుకు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం లేదని నిలదీశారు.
‘‘తెలంగాణలో ప్రతి గింజా కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. కళ్లాల వద్ద వడ్లు సేకరించి మిల్లులకు తరలించి బియ్యం ఆడించే దాకా అవసరమయ్యే సుతిలిదారం, కాంటా, రవాణా, హమాలీ చార్జీలతో పాటు వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్‌సీఐకి చేర్చేదాకా అయ్యే ప్రతి రూపాయినీ కేంద్రమే చెల్లిస్తోంది” అని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతీ గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందంటూ ప్రచారం చేసుకున్న మీరు ఇప్పుడెందుకు ప్లేటు ఫిరాయిస్తున్నారు? అంటూ ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ధాన్యం సేకరణకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్ ఎస్ నేతలు ఆందోళనల పేరుతో రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయకపోవడంతో రైతులను దళారులు లూటీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. దళారులతో కుమ్మక్కై ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. వ్యాపారులు కనీస మద్దతు ధర రూ. 1,960 చెల్లించడం లేదని, తక్కువ ధరకు రైతులు వడ్లను అమ్ముకొని నష్టపోతున్నారని, దీనికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.

More Stories
పైరసీ వెబ్ సైట్ ఐ బొమ్మ నిర్వాహకుడు రవి అరెస్ట్
పంచ పరివర్తన స్ఫూర్తితో విపణి పర్వ పేరుతో వినూత్న మార్కెట్
తెలంగాణాలో సెంటిమెంట్ పని చేయదా!