తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ భరోసా వ్యక్తం చేశారు. బీజేపీ ఆవిర్భావదినం సందర్భంగా కార్యాలయంలో పార్టీ జెండాను ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రాన్ని సీఎం కేసీఆర్ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. 

మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచారని, నిరుద్యోగులు, రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలవద్దకు పోతామని, గడప గడపకు వెళతామని ప్రజలకు వాస్తవ విషయాలను వివరిస్తామని, ప్రజలను చైతన్నవంతులను చేస్తామని చెప్పారు. 

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని, గోల్కొండ కోటపై కాషాయం జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నియంత, అరాచక, కుటుంబ పాలన కొనసాగుతోందని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు బీజేపీ కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని పిలుపిచ్చారు. 

నమ్మిన సిద్ధాంతాల కోసం నిత్యం పోరాడుతూ చావుకు కూడా వెనుకాడని నైజం బీజేపీ కార్యకర్తలదని పేర్కొన్నారు. అధికారం కోసం కాదు.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అన్నారు. ప్రధాని మోదీ, నడ్డా సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళుతోందని బండి సంజయ్ తెలిపారు. 

బీజేపీ కార్యకర్తలకు ఇవాళ పండగ రోజని చెబుతూ పార్టీ నిర్మాణంలో అనేక మంది త్యాగాలు ఉన్నాయని పేర్కొన్నారు. నమ్మిన సిద్ధాంతాల కోసం నిత్యం పోరాడుతూ చావుకు కూడా వెనుకాడని నైజం బీజేపీ కార్యకర్తలదని చెప్పారు. అధికారం కోసం కాదు.. నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేసే పార్టీ బీజేపీ అని స్పష్టం చేశారు. 

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ త్యాగం వృధా కాలేదని, రెండు సీట్లతో ప్రారంభమైన పార్టీకి ఇవాళ 300కు పైగా ఎంపీలు ఉన్నారంటే పార్టీ సిద్ధాంతమే కారణమని స్పష్టం చేశారు. మోదీ, నడ్డా సారథ్యంలో పార్టీ మరింత ముందుకు వెళ్తుందని భరోసా వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించేందుకు కార్యకర్తలు కంకణం కట్టుకోవాలని పిలుపిచ్చారు. టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక పాలనపై ప్రతి గ్రామం తిరిగి ఎండగడుతామని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్ల పేరుతో యువతను, ధాన్యం సేకరణ విషయంలో రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. కేవలం అధికారం కోసం పనిచేసే పార్టీలు దేశంలో ఉండలేవని స్పష్టం చేశారు.