 
                తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు వ్యతిరేకి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్  ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని ఆయన దుయ్యబట్టారు. ఎంత ముడి ధాన్యం ఇస్తారో ఇంత వరకు కేంద్రానికి చెప్పలేదని విమర్శించారు. 
అన్ని రాష్ట్రాలు ఎఫ్‌సీఐతో ఒప్పందం చేసుకున్నాయని, కానీ తెలంగాణ మాత్రం ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదని కేంద్ర మంత్రి  తప్పుబట్టారు.రైతులను అడ్డంపెట్టుకుని కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ చేతకానితనాన్ని కేంద్రంపై రుద్దాలని చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 
రైతులకు కేసీఆర్ భ్రమలు కల్పించి నష్టం చేకూరుస్తున్నారని గోయల్  విమర్శించారు. గతంలో కంటే ఏడున్నర రెట్లు తెలంగాణ నుంచి ధాన్యం సేకరించామని ఆయన తెలిపారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపడం లేదని స్పష్టం చేశారు.  కావాలనే కేంద్రంపై కేసీఆర్ దుష్ప్రచారం చేస్తున్నారని గోయల్ మండిపడ్డారు. 
లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ 
తొలుత లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు. అంతకు ముందు లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనకు దిగారు. కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. టీఆర్ఎస్ లోకసభ పక్ష నేత నామ నాగేశ్వరరావు బీజేపీ సర్కారు హామీలపై నామ వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. 
దేశంలో రోజురోజుకి పెరుగుతున్న నిరుద్యోగం, ఉపాధి లేక యువత ఆత్మహత్యలపై చర్చను కోరుతూ వాయిదా తీర్మానం నోటీసు అందజేశారు. దేశంలో నిరుద్యోగ యువతకి ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన హామీని అమలు పరచాలని డిమాండ్ చేశారు. దేశ యువతను ఇబ్బoదులకి గురి చేసే కీలక అంశాలపై చర్చ జరపాలని నామ కోరారు. వాయిదా తీర్మానం నోటీస్‌పై చర్చకు అనుమతించక పోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు వాకౌట్ చేశారు.
                            
                        
	                    




More Stories
మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ లో దేశీయ తొలి ప్రైవేట్ రాకెట్
అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై బీజేపీ ఫిర్యాదు