తండ్రితో సంబంధం వద్దనుకొనే కుమార్తెకు డబ్బు కూడా లేదు!

తండ్రితో సంబంధం వద్దనుకొనే కుమార్తెకు డబ్బు కూడా లేదు!

తండ్రితో కుమార్తె ఎటువంటి సంబంధాలు కొనసాగించకూడదని భావిస్తే.. ఆమె తన విద్య, వివాహం కోసం తండ్రి నుండి ఎలాంటి ఆర్థిక సాయాన్ని పొందేందుకు అర్హురాలు కాదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఇక కూతురి చదువు, పెళ్లి ఖర్చుల విషయానికొస్తే.. ఆమె 20 ఏళ్లు ఉంటాయని, అప్పీలుదారునితో ఎలాంటి సంబంధాన్ని కొనసాగించకూడదని భావిస్తున్నట్లు కనిపిస్తుందది. 

`తన సొంత మార్గాన్ని ఎంచుకునే అర్హత కలిగి ఉంది. కానీ అప్పీలుదారు నుండి విద్యకు సంబంధించిన మొత్తాన్ని డిమాండ్‌ చేయలేదు. అందువల్ల తండ్రి నుండి ఎటువంటి మొత్తానికి ఆమె అర్హురాలు కాదని భావిస్తున్నాం’ జస్టిస్‌ సంజరు కె కౌల్‌ ధర్మాసనం తీర్పునిచ్చింది. 

తల్లిదండ్రులు విడిపోగా.. తల్లితో జీవిస్తున్న ఓ కుమార్తె తన తండ్రితో జీవించేందుకు విముఖత వ్యక్తం చేస్తోంది. కాగా, చదువు నిమిత్తం ఆయన నుండి ఆర్థిక సాయాన్ని పొందేందుకు ఆయనకు కుమార్తెగా జీవించాలని గతంలో కోర్టు తెలిపింది.

తల్లిదండ్రులకు విడాకులవ్వగా, కుమార్తెకు ఆర్థిక సాయాన్ని ఇవ్వడంపై పంజాబ్‌, హర్యానా కోర్టు తీర్పును సవాలు చేస్తూ తండ్రి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు  భార్యాభర్తలను కలిపేందుకు మధ్యవర్తిత్వం కూడా పనిచేయనందున వీరికి కోర్టు విడాకులు మంజూరు చేసిందని గ్రహించింది. 

కుమార్తె  తండ్రితో జీవించాలనుకోవడం లేదని భావించిన కోర్టు.. ఆయన నుండి ఆర్థిక సాయాన్ని పొందేందుకు అర్హురాలు కాదని తేల్చింది. అయితే భార్యకు భరణం కింద చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ణయించేటప్పుడు  ప్రతివాది (భార్య) కుమార్తెను ఆదుకోవాలని కోరుకుంటే నిధులు అందుబాటులో ఉండేలా తాము ఇంకా జాగ్రత్త తీసుకుంటామని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.