గత శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంటున్న `ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. సినిమాను చూసిన ఆయన చిత్ర దర్శక, నిర్మాతలైన వివేక్ అగ్నిహోత్రితో పాటు గు నిర్మాత అభిషేక్ అగర్వాల్ను అభినందించారు.
అప్పట్లో కశ్మీర్లో జరిగిన సంఘటనలను కళ్లకు కట్టినట్టు చూపించారని ప్రధాని అభినందించినట్టు చిత్ర దర్శక, నిర్మాతలు పేర్కొన్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్ తన ట్విటర్ హ్యాండిల్లో షేర్ చేస్తూ ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ది కశ్మీర్ ఫైల్స్ సినిమాను ఆయ ప్రశంసించడం, దాని గొప్పతనం గురించి చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. మేము ఆ చిత్రాన్ని నిర్మించడంలో ఎప్పుడూ గర్వపడలేదు. ధన్యవాదాలు మోదీజీ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ను రీట్వీట్ చేస్తూ ప్రేక్షకులతో పంచుకున్నారు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి.

More Stories
కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీని అడ్డుకున్న బీజేపీ
లింగ నిష్పత్తిలో కేరళ ఆదర్శవంతం
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం