
సేవ్ అమరావతి నినాదం ఇకపై బిల్డ్ అమరావతిగా మారుస్తున్న ట్లుఅమరావతి రాజధాని ఐకాస నేతలు వెల్లడించారు.
రాజధాని అమరావతి అభివృద్ధికి రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
గుంటూరులో అమరావతి రాజధాని ఐకాస నేతలు సమావేశమై హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై సమాలోచనలు చేశారు. ఈ సమావేశంలో ఐకాస కన్వినర్ పువ్వాడ సుధాకర్‌రెడ్డి , రాజధాని గ్రామాల ప్రతినిధులు పాల్గొన్నారు. బడ్జెట్‌లో అమరావతికి నిధులు కేటాయించలేదని అసహనం వ్యక్తం చేశారు.
కేవలం రాజధాని ప్రాంత రైతులే కాదు.. ప్రజలంతా అమరావతి కోసం నిలబడ్డారని పేర్కొన్నారు. హైకోర్టు కూడా అమరావతికి అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. హైకోర్టు తీర్పును అమలు చేయాలని.. రాజధానిలో ప్రభుత్వం వెంటనే అభివృద్ధి పనులు మొదలు పెట్టాలని కోరారు.
రాజధాని గ్రామాల్లో దీక్షా శిబిరాలు కొనసాగిస్తామని.. ప్రభుత్వం పనులు మొదలు పెట్టాకే ఐకాస చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారికోసం ప్రభుత్వాలు అప్రమత్తం
ఏపీలో నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు