ఉక్రెయిన్‌ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా

ఉక్రెయిన్‌ పై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా
అందరూ భయపడుతున్నట్లుగానే  ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా సైన్యం బాంబుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచ దేశాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా, ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా. రష్యా మాత్రం వెనక్కి తగ్గడంలేదు. ఉక్రెయిన్ బలగాలు వెంటనే ఆయుధాలు విడిచి వెనక్కి వెళ్లాలని రష్యా హెచ్చరించింది.
 
 ఇప్పటి వరకు ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఉన్న రష్యా బలగాలు.. ఉక్రెయిన్ లోకి చొచ్చుకెళ్తున్నాయి. ఉక్రెయిన్పై నలువైపులా మిస్సైల్ దాడులతో విరుచుకుపడుతోంది రష్యా. రష్యా చర్యలకు ప్రతి చర్యలతో ఉక్రెయిన్ అప్రమత్తమైంది.
 
ఉక్రెయిన్. రష్యా దాడులను తిప్పి కొట్టడానికి అన్ని విధాల  సిద్ధమైంది  దేశ ప్రజలనుద్దేశించి భావోద్వేగంతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమీర్ జెలెన్ స్కీ మాట్లాడుతూ రష్యా అధ్యక్షుడు పుతిన్కు తాను ఫోన్ చేస్తే స్పందించడం లేదని చెప్పారు.  ఉక్రెయిన్ ప్రజల స్వతంత్రత, స్వేచ్ఛను కాపాడేందుకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్‌లో ఇప్పటికే 30 రోజుల పాటు ఎమెర్జెన్సీ ప్రకటిస్తున్నట్లు ఆ దేశ సెక్యూరిటీ కౌన్సిల్ బుధవారం ప్రకటించింది. ఈ ఆదేశం ఉక్రెయిన్ పరిధిలోని డోనెస్క్, లుహాస్క్ సహా అన్ని టెర్రిటరీలకు వర్తింస్తుందని ఉక్రెయిన్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 
 
రష్యాతో ఉద్రిక్తలు ముదురుతున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తీసుకున్న 30 రోజుల ఎమెర్జెన్సీ నిర్ణయం, వీలైతే మరో 30 రోజులకు పెరగొచ్చని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని అన్ని ఎంబసీలను, అంతర్జాతీయ కార్యాలయాలను మూసివేశారు. 
 
ఇక విమానాలు కూడా ఒకటొకటిగా రద్దు అవుతున్నాయి. ఈ నెపథ్యంలో రష్యాలో ఉన్న తమ దేశస్తులను వెనక్కి వచ్చేయాలని ఉక్రెయిన్‌ ఇప్పటికే కోరింది. మిన్క్స్ ఒప్పందం ప్రకారం.. ఉక్రెయిన్‌లో అధికార వికేంద్రీకరణ జరగాలి. కానీ, అందుకు ఉక్రెయిన్‌ ఒప్పుకోవడం లేదు. దీనికతోడు ఉక్రెయిన్‌ను నాటోలో చేరాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఇది రష్యాకు ఎంత మాత్రం ఇష్టం లేదు.
 
 ఉక్రెయిన్‌పై అమెరికా ఒత్తిడి రోజు రోజుకి పెరుగుతోంది. దీంతో రష్యా దూకుడు పెంచి ఉక్రెయిన్‌లోని డోనెస్క్, లుహాస్క్ ప్రాంతాలకు రష్యా తాజాగా స్వాతంత్య్రంను  ప్రకటించింది. వాటికి మద్దతుగా రష్యా తన బలగాలను పంపిస్తోంది.  దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం చేయబోతోందా అనే అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నాయి.
 
రెండు స్వతంత్య్ర దేశాలుగా గుర్తించిన డాంటెస్క్‌, లుగాన్స్క్‌లు.. శాంతి పరిరక్షణ కోసం అవసరమైన బలగాలను పంపాలని రక్షణ శాఖను కోరిన పిదప రష్యా తమ బలగాలను తరలిస్తోంది. ఉక్రెయిన్‌ సరిహద్దుల చుట్టూ బలగాలను భారీగా మోహరిస్తోంది. 
దక్షిణ బెలారస్‌లో ఉక్రెయిన్‌ సరిహద్దులకు సమీపంగా రష్యా సేనలు చేరుకున్నాయి. మాక్సర్‌ అనే సంస్థ సేకరించిన ఉపగ్రహ చిత్రాల్లో తేటతెల్లమైంది. ఇక్కడ మోహరించిన బలగాలకు అవసరమైన రవాణా సౌకర్యాలను, ఇతర సామాగ్రిని తరలిస్తున్నారు
 
కాగా, ఉక్రెయిన్‌ సరిహద్దులకు రష్యా ..తమ దళాలను తరలిస్తుండగా.. ప్రతిగా తూర్పు ఐరోపా ప్రాంతంలో వందలాది బలగాలను కెనడా తరలిస్తోంది. రష్యా చర్యలను వ్యతిరేకిస్తున్న కెనడా.. ఆదేశంపై కొత్త ఆంక్షలను విధిస్తున్నట్లు తెలిపింది.  రష్యా దూకుడు నేపథ్యంలో నాటో దళాలను బలపరిచేందుకు లాత్వియా సహా పరిసర ప్రాంతాల్లోకి 460 మంది సభ్యులతో కూడిన సాయుధ బలగాలను పంపుతున్నట్లు కెనడా ప్రధాని ట్రూడో పేర్కొన్నారు.
 
కాగా, రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతామండలి మరోసారి అత్యవసరంగా సమావేశం కానుంది. మూడు రోజుల వ్యవధిలో రెండవసారి అత్యవసర సమావేశం నిర్వహించడం గమనార్హం. సైనిక మోహరింపు, తదితర పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుందని దౌత్యవర్గాలు తెలిపాయి.