సముద్ర జల వాణిజ్యంపై భారత్ – ఫ్రాన్స్ ఒప్పందం

సముద్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ద్వైపాక్షిక మార్పిడులను పెంచుకునేందుకు భారత్‌, ఫ్రాన్స్‌లు ఒక ఒప్పందంపై సంతకాలు చేశాయి. చట్టబద్ధ పాలన ప్రాతిపదికగా సముద్ర జలాలను ఉపయోగించుకోవడంపై ఉమ్మడి దార్శనికతను రూపొందించుకున్న స్థిరమైన తీరప్రాంత, సముద్ర జల మార్గాల మౌలిక సదుపాయాలపై పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. 
 
ఆదివారం నుంచి మూడు రోజుల పాటు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ఫ్రాన్స్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జేన్‌ వైస్‌ లె డ్రియాన్‌తో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. 
 
సముద్ర జలాల వాణిజ్యం, నావికారంగ పరిశ్రమ, మత్స్య సంపద, మెరైన్‌ టెక్నాలజీ, శాస్త్రీయ పరిశోధన, సముద్ర జలాలపై అధ్యయనం, సముద్ర జలాల్లో జీవ వైవిధ్యత, పర్యావరణ వ్యవస్థ ప్రాతిపదికగా సమగ్ర తీరప్రాంత నిర్వహణ, పర్యావరణ అనుకూల పర్యాటకం వంటి పలు అంశాలపై ఒప్పందంలో భాగంగా ఒక ప్రణాళికను రూపొందించారు.
 
 తమ తమ దేశాల ప్రగతికి ఒక చోదక శక్తిగా సముద్ర జలాల ఆర్థిక వ్యవ్థను ఉపయోగించుకోవాలనిఇరు దేశాలు భావిస్తునాుయనివిదేశాంగ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. అదే సమయంలో పర్యావరణ, తీరప్రాంత, సముద్ర జలాల జీవ వైవిధ్యతను కూడా గౌరవించాల్సి వుందనిపేర్కొంది. 
 
సముద్ర జలాలు అంతర్జాతీయంగా ఉమ్మడి ప్రాంతంగా వుండేందుకుహామీ కల్పిస్తూ, సముద్ర పరిరక్షణ, శాస్త్రీయ విజ్ఞానానికి దోహదపడాలని ఇరు దేశాలు నిర్ణయించాయి.
 
 సముద్ర వనరులను పరిరక్షించుకుంటూ, నిలకడగా ఉపయోగించుకుంటూ అభివృద్ధి సాధించాలనే ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి ఎజెండా అమలుకు దోహదపడాలని ఇరు దేశాలు భావిస్తున్నట్లు ఆ ప్రకటన పేర్కొంది.  చేపల వేట నిపుణులకు మంచి జీవన పరిస్థితులు కల్పించేందుకు హామీ కల్పిస్తూ చేపల వేట పట్ల స్థిరమైన దృక్పథానిు రూపొందించుకోవాలని ఉభయ పక్షాలు పిలుపునిచ్చాయి.