
దాణా కుంభకోణంలో దోషిగా తేలిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీ సీబీఐ కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసులో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు రూ. 60 లక్షల రూపాయల జరిమానా విధించింది.
ఫిబ్రవరి 15న కోర్టు దాణా కుంభకోణం ఐదో కేసులో లాలూను దోషిగా తేల్చింది. ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దొరాండా ట్రెజరీ నుంచి రూ.139.5కోట్లు అక్రమంగా విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు.. సాక్ష్యాధారాలు పరిశీలించిన అనంతరం శిక్ష ఖరారు చేసింది.
దాణా కుంభకోణానికి సంబంధించి ఇతర కేసుల్లో దోషిగా తేలిన లాలూకు ఇప్పటికే 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. మూడున్నర ఏళ్ల పాటు జైలులో గడిపిన ఆర్జేడీ చీఫ్.. అనారోగ్యం కారణాలతో ఇటీవలే బెయిల్పై బయటకు వచ్చారు. రాంచీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఆయన.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు విచారణకు హాజరయ్యారు.
1996లో నమోదైన దాణా కుంభకోణం కేసులో 170 మంది నిందితులుగా ఉండగా.. వారిలో 55 మంది ఇప్పటికే మరణించారు. దాణా కుంభకోణంలోనే భగల్పూర్ ట్రెజరీ నుంచి అక్రమంగా డబ్బు విత్ డ్రా చేసిన కేసు విచారణ పాట్నా సీబీఐ కోర్టులో పెండింగ్లో ఉంది. తాజా కేసు 139. 35 కోట్ల రూపాయలకు సంబంధించినది. ఈ కేసులో 36 మందికి మూడేళ్ల జైలుశిక్ష పడింది.
More Stories
దాడులకు కుట్ర.. పాక్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ కోర్టు సమన్లు
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ