ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లపై ఆందోళన

మూడోవేవ్‌కు కారణమైన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఉధృతి ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు దేశాలు ఆంక్షలను తొలగిస్తున్నాయి. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ సబ్‌ వేరియంట్లపై ఆందోళనను వ్యక్తం చేసింది. వైరస్‌ వృద్ధి చెందుతోందని, ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని డబ్ల్యుహెచ్‌ఒ టెక్నికల్‌ లీడ్‌ మరియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. 

బిఎ 1, బిఎ 1.1, బిఎ.2, బిఎ.3 వంటి వేరియంట్లను గుర్తించామని తెలిపారు. ఇప్పటి డెల్టా వేరియంట్‌ను ఒమిక్రాన్‌ను ఎలా అధిగమించామో నిజంగా నమ్మశక్యంగా లేదని వాపోయారు. జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ చేయగా బిఎ1, బిఎ2లు బాగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.

ఒమిక్రాన్ కరోనావైరస్ రూపాంతరమైన బిఏ.2 అనే సబ్‌వేరియంట్ చాలా వేగవంతంగా వ్యాపించడమేకాక, తీవ్ర వ్యాధిని కలిగించగలదని ప్రయోగశాల అధ్యయనం సూచించింది. ‘ఎట్‌టుబీ పీర్’ కనుగొన్న విషయాలను సమీక్షించింది. ఇటీవల ప్రీప్రింట్ రిపోజిటరీ ‘బయో ఆర్ 14’ లో పోస్ట్ చేసింది. 

పాత కరోనావైరస్ వేరియంట్స్ మాదిరిగానే బిఏ.2 సబ్‌వేరియంట్ తీవ్ర జబ్బుకు గురిచేయగలదని పేర్కొంది. అంతగా తీవ్రతరం కాని బిఏ.1 సబ్‌వేరియంట్ కన్నా బిఏ.2 సబ్‌వేరియంట్ వేగంగా విస్తరించగలదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

అయితే ఈ రెండు ప్రాణాంతకాలన్న ఆధారాలు లేవని చెప్పారు. ఓ వీడియో జత చేసిన డబ్ల్యుహెచ్‌ఒ.. గత వారం 75 వేల మరణాలు సంభవించాయని తెలిపింది. భారత్‌ కూడా ఆంక్షలు సడలించవచ్చునని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలివ్వగా.. డబ్ల్యుహెచ్‌ఒ ఆందోళనలు ఆలోచనలో పడేసేలా చేశాయి.