
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాలను తిరిగి కలిపివేస్తుందని టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై బిజెపి ఎమ్యెల్యే ఎన్ రఘునందనరావు తీవ్రంగా స్పందించారు. పార్లమెంట్ వేదికగా తెలుగు రాష్ట్రాల విభజనపై ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న వాఖ్యాలను ఆయన తప్పుబట్టారు.
కేటీఆర్, రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి రాకముందే మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అని గుర్తు చేస్తూ తెలంగాణ, ఏపీ కాదు.. పీవోకే (పాక్ ఆక్రమిత కాశ్మీర్)ను బరాబర్ భారత్‌లో కలుపుతామని ఆయన స్పష్టం చేశారు. మందస్తు ఎన్నికల కోసమే తెలంగాణలో అలజడి సృష్టించేందుకు కేసీఆర్ కుటుంబం ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
మందికి పుట్టిన బిడ్డను తమ బిడ్డగా చెప్పుకుంటోందెవరో కేసీఆర్‌కే బాగా తెలుసంటూ ఎద్దేవా చేశారు. బిల్లు కాంగ్రెస్ ప్రవేశపెడితే.. సమర్థించి బీజేపీ.. తెలంగాణను క్లమ్ చేసుకుంది మాత్రం కేసీఆర్ అని ధ్వజమెత్తారు. కుటుంబాల సౌలభ్యం కోసం రాష్ట్రాలను విభజించలేదని కేటీఆర్ గుర్తుంచుకోవాలని హితవు చెప్పారు.
అగ్గిపెట్టె మంత్రితో చర్చకు కిషన్ రెడ్డి అవసరం లేదని.. బీజేపీ కార్యకర్తలు చాలని తెలిపారు. 18 నెలల తర్వాత టీఆర్ఎస్‌ను తెలంగాణ ప్రజలు బీజేపీలో కలుపటం ఖాయమని స్పష్టం చేశారు. డబ్బులిచ్చి గుజరాత్, వారణాసిలో కేసీఆర్ ఫ్లెక్సీలు పెట్టించుకోవటం సిగ్గుచేటని మండిపడ్డారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అమరుల కుటుంబాలకు న్యాయం చేస్తే బాగుండేదని ఎమ్మెల్యే చెప్పారు.
సెంటిమెంట్‌ను రెచ్చగొట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని రఘునందనరావు ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పాటుపై తన సవాల్‌కు అగ్గిపెట్టె మంత్రి, పీసీసీ చీఫ్‌లు తోకముడిచారని విమర్శలు గుప్పించారు. ఉద్యమంలో బీజేపీ, కిషన్ రెడ్డి పాత్రపై తెలంగాణ ప్రజలకు తెలుసని చెప్పారు.
ఒక్కటి అని నాలుగు అనించుకోవద్దని కేటీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తల్లిని, చెల్లిని గౌరవించని సంస్కారం కేసీఆర్ కుటుంబానిదని మండిపడ్డాయిరు. ఉత్తర, దక్షిణ భారతదేశం అంటూ తిరిగిన కమలహాసన్, ప్రకాష్ రాజ్‌లు ఏమైయ్యారో కేసీఆర్ తెలుసుకోవాలని రఘునందనరావు సూచించారు.
More Stories
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది
కొత్తగూడెంలో ఆరుగురు మావోయిస్టులు లొంగుబాటు