పద్మశ్రీ అవార్డు గ్రహీత ఆశావాది ప్రకాశరావు గురువారం కన్నుమూశారు. ఆయన 1944 ఆగస్టు 2న జన్మించారు. ఆయన జీవిత విశేషాల్లోకి వెళితే.. డిగ్రీ ప్రథమ సంవత్సరం (1962) చదువుకుంటున్న రోజుల్లోనే అప్పటి రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ‘బాలకవి’గా ఆశీర్వదప్రాప్తి అందుకున్నారు.
అనేక పత్రికల్లో వీరి కవితలు, వ్యాసాలు ముద్రితమయ్యాయి. అలాగే వీరి సాహిత్య వికాసంపై కెవిఆర్ ప్రభుత్వ మహిలా కళాశాల కర్నూలులో జాతీయ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈయనకు పలు సాహితీ సాంస్కృతిక సంస్థలు 13 రకాల బిరుదులిచ్చి సత్కరించాయి.
2010 నుండి ఆశావాది సాహితీ కుటుంబ పక్షాన సంప్రదాయ కవులకు ఆధునిక రచయితలకు, సంఘసేవలకులకు, ఆధ్యాత్మిక ప్రచారకులకు, ప్రతి సంవత్సరం ఆత్మీయ పురస్కారాల ప్రదానం చేస్తోంది.

More Stories
ఏపీలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
1500 ఏళ్ల భావన్నారాయణ స్వామి రథం వేలం
28న అమరావతిలో 12 బ్యాంకుల భవనాలకు శంకుస్థాపన