
తెలంగాణలో కొమరం భీమ్, ఆంద్రప్రదేశ్‌లో అల్లూరి సీతారామరాజు పేరుతో గిరిజన మ్యూజియంలను ఏర్పాటు చేయబోతున్నామని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కొమరం భీమ్ కోసం రూ 18 కోట్లు, అల్లూరి సీతారామరాజు కోసం రూ 35 కోట్లు కేటాయించామని చెప్పారు.
ఆజాది కా అమ్రిత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా భారతదేశంలోని మ్యూజియంలను రీఇమేజింగ్ చేయడంపై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన మంగళవారం ప్రారంభించారు.
నిజాం నగలు తెలంగాణకి తీసుకురాడానికి కృషి చేస్తామని చెబుతూ ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి భద్రతతో కూడిన ఒక భవనం ఏర్పాటు చేస్తే తాము ముందుకోస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటు చేయదానికి కేంద్రం ముందుకొచ్చిందని మంత్రి తెలిపారు.
దీనికి 25 ఎకరాలు భూమి అవసరం ఉందని, భూమి కేటాయించాలని సీఎం కేసీఆర్ కు లేఖ రాశామని చెప్పారు. అయితేఆ లేఖకు ఇంకా రిప్లై రాలేదని తెలిపారు. భారతదేశం మానవ నాగరికత ప్రారంభమైనప్పటి నుండి గొప్ప సాంస్కృతిక వారసత్వం కలిగిన భూమి అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటున్న తరుణంలో, మన సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించడం, శాశ్వతంగా కొనసాగించడం పట్ల కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. భారతదేశంలోని 1000కి పైగా మ్యూజియంలు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శించడంలో భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు.
గత ఏడేళ్లుగా కొత్త మ్యూజియంలను నిర్మించడంపై దృష్టి సారిస్తున్నామని చెబుతూ ఇప్పటికే ఉన్న మ్యూజియంలను కొత్త తరానికి అనువుగా ఉండేలా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోందని వెల్లడించారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర సమరయోధుల పేరుతో 10 నూతన మ్యూజియంలను ఏర్పాటు చేయబోతున్నామని కేంద్రమంత్రి తెలిపారు.
రెండు రోజులపాటు ఆన్లైన్ ఫ్లాట్ ఫామ్ ద్వారా జరగనున్న ఈ సదస్సులో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇటలీ, సింగపూర్, యూ.ఏ.ఈ., యూ.కే., అమెరికా, భారత్ వంటి ఎనిమిది దేశాలకు చెందిన మూడువేల మంది ప్రతినిధులు పాల్గొంటున్నారు.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి