పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్వీ-52 రాకెట్‌ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష రంగంలో మరో అద్భుతానికి ముందడుగు పడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన వాహననౌక పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ -సి52 విజయవంతమైంది. సోమవారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకుపోయింది.
 
 ఆంధ్రప్రదేశ్‎లోని పోట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి దీన్ని చేపట్టారు. మూడు ఉపగ్రహాలతో పాటు ఈవోఎస్‌-04, ఐఎన్‌ఎస్‌-2టీడీ, ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను పీఎస్‌ఎల్వీ- సీ52 రోదసిలోకి మోసుకెళ్లింది.
 
 1,710 కిలోల ఆర్‌ఐ(ఈవోఎస్‌-04), 17.50 కిలోల ఐఎన్‌ఎస్‌-2టీడీ..8.10 కిలోల ఇన్‌స్పైర్‌ శాట్‌-1 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
పీఎస్ఎల్వీ-5ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ 2 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ వెల్లడించారు. శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.
వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్ఐశాట్-1 ఉపగ్రహం భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్ఎస్ 2టీడీ ఉపగ్రహం ప్రయోగించారు.  కాగా,  ఇన్ స్పైర్ శాట్ -1:వ భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్‎స్పైర్ శాట్ -1 ఉపగ్రహం;  ఐఎన్ఎస్-2టీడీ: భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం. ఈ ఉపగ్రహ జీవితకాలం ఆరు నెలలు. దీని బరువు 17.5 కిలోలు