ఎంపికలు తీసివేయబడినప్పుడు మాత్రమే బుర్ఖా/హిజాబ్ ధరించాల్సి ఉంటుందని బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ తెలిపారు. “ఇస్లాం రాజకీయం వలే, బుర్ఖా/హిజాబ్ కూడా నేడు రాజకీయం అయింది” అని ఆమె పేర్కొన్నారు. మత హక్కు , విద్యా హక్కుకు అతీతం కాదని కూడా ఆమె స్పష్టం చేశారు.
బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్‌తో ఆమె పోల్చారు. బుర్ఖా, హిజాబ్ ఎప్పటికీ స్త్రీ ఎంపిక కాదని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇదిలావుండగా కర్నాటకలోని ఉన్నత విద్యా సంస్థల్లో తమని హిజాబ్ (శిరోవస్త్రం)తో ప్రవేశించనివ్వాలని అక్కడి కొందరు ముస్లిం విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు.
అది కాస్తా తర్వాత నిరసనలు, ప్రతి నిరసనలకు దారితీసింది. “వేరే మార్గం లేనప్పుడే వారు హిజాబ్‌ను ధరించక తప్పదు. ఇస్లాం రాజకీయం మాదిరిగా నేడు బుర్ఖా/హిజాబ్ కూడా రాజకీయం అయిపోయింది” అని తస్లీమా నస్రీన్ ట్విట్టర్‌లో రాశారు.
“ముస్లిం మహిళలు బుర్ఖాను చీకటి యుగపు పవిత్ర బెల్ట్ (చేస్టిటి బెల్ట్) మాదిరిగా చూడాలి. సంఘర్షణలను అరికట్టడానికి ఉమ్మడి పౌర స్మృతి, ఉమ్మడి యూనిఫారం అవసరమని నేను నమ్ముతున్నాను. మత హక్కు, విద్యా హక్కు కంటే ఎక్కువేమి కాదు” అని తస్లీమా న్యూస్ ప్లాట్‌ఫారమ్‌లో రాశారు.

More Stories
మహిళా రిజర్వేషన్లపై రెండు కీలక బిల్లులు ఆమోదం
ఖర్గే రెచ్చగొట్టే ప్రసంగంపై ఆర్ఎస్ఎస్, బీజేపీ పోలీస్ ఫిర్యాదు
రెచ్చగొట్టే వ్యాఖ్యలపై ఖర్గేను అరెస్ట్ చేయండి!