మార్చ్ 15 నాటికి కొత్త జిల్లాల నోటిఫికేషన్!

ఉగాది నుండి కొత్త జిల్లాల్లో పాలన మొదలు పెట్టి తీరాలని పట్టుదలగా ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేగంగా కసరత్తు చేస్తున్నది.  ఉగాదికి పది పదహేను రోజుల ముందే ఈ దిశలో అవసరమైన పాలనాపరమైన చర్యలన్నింటిని పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిలో భాగంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రకియకు సంబంధించి మార్చి 15ను డెడ్‌లైన్‌గా నిర్ణయించింది.
 
 జిల్లా కలెక్టర్ల నుండి వచ్చే వివిధ సిఫార్సులు, అభ్యంతరాలు, వివరణలను పరిశీలించి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవడానికి వీలుగా ప్రణాళిక శాఖలో త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ప్రణాళిక శాఖ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ కమిటీ జిల్లా కలెక్టర్లతో పాటు ఈ ప్రక్రియలో భాగస్వాములైన ఇతర అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ అవసరమైన సలహాలు ఇస్తుంది.
 
ఆ లోగానే తుది నోటిఫికేషన్లు జారీ చేయాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అభ్యంతరాల స్వీకరణతో పాటు సిఎం ఆదేశించిన విధంగా వాటి నిశిత పరిశీలన, హేతు బద్దత ఉన్న అభ్యంతరాలపై చర్చలు తదితర ప్రక్రియ అంతా తాజా డెడ్‌లైన్‌ అయిన మార్చి 15కు కనీసం 10 రోజులు ముందుగా పూర్తి కావాల్సిఉంది. 
 
దీంతో ఈ నెలాఖరుకు ఈ ప్రక్రియను పూర్తిచేసి నోటిఫికేషన్ల రూపకల్పనపై దృష్టి సారించాలని అధికారయంత్రాంగం భావిస్తోంది. ఈ మేరకు అవసరమైన చర్యలను వేగంగా తీసుకునేందుకు నాలుగు సబ్‌కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సరిహద్దుల నిర్ధారణ, మ్యాప్‌లు, భవనాల నిర్మాణం, ఆస్తులు, ఉద్యోగులు, ఐటి సేవల వంటి అంశాలను ఈ కమిటీల పరిధిలోకి చేర్చారు.
 
 క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను సిఎస్‌, సిఎంలే నేరుగా పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. మొత్తం 26 జిల్లాలకు సంబంధించిన సరిహద్దులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలను అదేశాలు ఇప్పటికే జారీ అయ్యాయి. ఆ జిల్లాలోకి వచ్చే మండలాలు, శాసనసభ నియోజకవర్గాల హద్దులను కూడా సిద్ధం చేయాలని ఆదేశించారు.

కాగా,  కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నప్పటికీ కొత్తగా ఉద్యోగ కల్పన జరిగే అవకాశాలేమి కనిపించడం లేదు. తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో జిల్లాల్లో పనిచేసే ఉద్యోగుల వివరాలను ఖరారు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే సమయంలో అదనపు ఉద్యోగాల ప్రతిపాదనలు ఉండకూడదని స్పష్టంగా ఆదేశించడం గమనార్హం.  
 
`కొత్త జిల్లాల్లో ప్రభుత్వ శాఖలన్నింటిని ఏర్పాటు చేయాలి. అదనపు ఉద్యోగులు ఉండవన్న సూత్రం ప్రకారం ఈ నిర్మాణం జరగాలి.’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్త జిల్లాల పరిధిలోకి వచ్చే స్థిర, చరాస్తుల వివరాలు కూడా సిద్ధం చేయాలని, ప్రభుత్వ, ప్రభుత్వ రరగ సంస్థలకు చెరదిన భవనాల వివరాలు కూడా వాటిల్లో ఉండాలని ఆదేశించారు. 
 
ఇప్పటికే ఉను ప్రభుత్వ భవనాల వివరాలు కూడా సమర్పించాలని ఆదేశాలు వెళ్లాయి. అలాగే వాహనాలు, ఫరిుచర్‌ వరటి చరాస్తుల వివరాలు కూడా అరదిరచాలనిపేర్కొనాురు. ప్రభుత్వం త్వరలో నిర్వహించే మరో సమావేశానికి ముందుగానే ఈ వివరాలు కావాలని నిర్దేసించారు.

పాలనకు కీలకమైన ఈ-ఆఫీస్‌ నిర్వహణ బాధ్యతలను ఐటి శాఖకు అప్పగించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాలని, మండల స్థాయి వరకు ఐటి సేవలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

 
కొత్త జిల్లాల్లో, ఆ జిల్లాల్లోని ముఖమైన ప్రారతాల్లో ఐటి అవసరాలను ముందుగానే గుర్తించడం, వీడియో కాన్ఫెరెెన్స్‌ సౌకర్యాలను కల్పించడం, అదనపు ఐటి సర్వర్లను ఏర్పాటు చేయడంపైనా దృష్టి సారించాలని ఆ శాఖల అధికారులను ఆదేశించారు.
జిల్లాల్లో భవనాల నిర్మాణానికి, ఇతర అవసరాలకు కనీసం 30 వేల చదరపు అడుగుల భూమిని సిద్ధం చేయాలని, మరో 20 వేల చదరపు అడుగుల ఖాళీ ప్రభుత్వ భూమిని కూడా గుర్తించాలని నిర్దేశించారు.