స్కూళ్ల ప్రారంభంపై కేంద్రం మార్గదర్శకాలు

కరోనా భయాలు తొలగిపోవడంతో రాష్ట్రాలు క్రమంగా ఆంక్షలు సడలిస్తున్నాయి. కరోనా  కారణంగా మూతపడ్డ స్కూళ్లు, కాలేజీలు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. అయితే చాలా రాష్ట్రాలు ఇప్పటికీ బడులు తెరిచేందుకు వెనకాడుతున్నాయి. 

దేశంలో ఇప్పటి వరుకు కేవలం 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే స్కూళ్లు పూర్తి స్థాయిలో తెరుచుకున్నాయి. 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో బడులు పాక్షికంగా తెరుచుకోగా.. 9 రాష్ట్రాల్లో మాత్రం పాఠశాలలు ఇంకా పున ప్రారంభం కాలేదు. 

స్కూళ్లు పూర్తిగా తెరిచిన రాష్ట్రాలు 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్, లక్షద్వీప్

పాక్షికంగా బడులు ప్రారంభమైన రాష్ట్రాలు
అసోం, ఛత్తీస్ ఘడ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, బెంగాల్, చండీఘడ్, డామన్ అండ్ డయ్యూ, అండమాన్ నికోబార్

ఇంకా స్కూళ్లు తెరుచుకోని రాష్ట్రాలు
బీహార్, ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, ఢిల్లీ, లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్, పుదుచ్ఛేరి.

పాఠశాలల పున ప్రారంభంపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం.. 

  • స్కూళ్లలో ఎప్పుడూ పరిశుభ్రవాతావరణ ఉండేలా చూడాలి. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. 
  • విద్యార్థుల మధ్య 6 అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు చేయాలి.
  • విద్యార్థులతో పాటు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. 
  • మధ్యాహ్న భోజన సమయంలో భౌతికదూరం పాటించాలి.
  • స్కూల్ బస్సులను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి.
  • హస్టళ్లలో పిల్లల బెడ్ల మధ్య భౌతిక దూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి.
  • పిల్లలను స్కూళ్లకు పంపేందుకు ప్రభుత్వాలు తల్లిదండ్రుల అంగీకారం తీసుకోవాలి.
  • తల్లిదండ్రులు కోరితే ఆన్లైన్ క్లాసులు కొనసాగించాలి.
  • భౌతిక దూరం సాధ్యం కానప్పుడు స్కూల్ ఈవెంట్లు నిర్వహించకూడదు.