 
                బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్రం అనూహ్యం నిర్ణయం తీసుకుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌గా (సీఈఏ) ప్రముఖ కన్సల్టెంట్, రచయిత, అకాడమీషియన్  డా. అనంత నాగేశ్వరన్‌ను నియమించింది. ఇప్పటి వరకు సీఈఏగా కొనసాగుతున్న కే సుబ్రమనియన్ స్థానంలో నాగేశ్వరన్‌ను నియామకం చేపట్టింది. 
బడ్జెట్ తయారీ పనుల్లో కేంద్రం నిమగ్నమైంది. గురువారమే బడ్జెట్ తయారీలో పాలు పంచుకునే ఆర్థికవేత్తలు, అధికారులు, సిబ్బందిని నార్త్ బ్లాక్‌లో లాక్‌ఇన్‌లోకి గురువారం పంపింది. లాక్‌ఇన్ మొదలైన తర్వాత 24 గంటల్లోపే ప్రస్తుతం ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారుని తప్పించి కొత్త వారిని నియమించారు.
ఆయన భారతదేశంలోను పలు సంస్థలతో పాటు సింగపూర్‌లోని అనేక బిజినెస్ స్కూల్స్,  మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలో బోధించారు.  విస్తృతంగా రచనలు చేశారు. ఐ ఎఫ్ ఎం ఆర్  గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు డీన్‌గా,  క్రియా యూనివర్సిటీలో విశిష్ట విజిటింగ్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ గా పనిచేశారు. 
ఆయన 2019 నుండి 2021 వరకు భారత ప్రధాన మంత్రికి ఆర్థిక సలహా మండలిలో పార్ట్ టైమ్ సభ్యునిగా కూడా ఉన్నారు.  ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, అహ్మదాబాద్ నుండి మేనేజ్‌మెంట్‌లో పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా,  యూనివర్సిటీ ఆఫ్  మసాచుసెట్స్. నుండి డాక్టరల్ డిగ్రీని కలిగి ఉన్నారు. అమ్హెర్స్ట్‌లోని మసాచుసెట్స్.
డిసెంబర్ తో తన పదవీకాలం పూర్తయిన తర్వాత  తిరిగి టీచింగ్ వైపు వెళ్లదలచిన్నట్లు కృష్ణమూర్తి  సుబ్రమణియన్ గత అక్టోబర్ లోనే ప్రకటించడంతో కొత్తవారిని నియమించవలసి వచ్చింది. 
                            
                        
	                    




More Stories
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్‌కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!