సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ మృతి

తెలుగు సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న, ప్రముఖ సాహితీ వేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్‌ తెల్లవారుజామున హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రిలో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. సుధాకర్‎కు భార్య స్వర్గీయ డా. పుట్ల హేమలత (ప్రముఖ రచయిత్రి కవి), ఇద్దరు కుమార్తెలు మానస, మనోఙ్ఞ.  
 
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి 21, 1959 న నిజామాబాద్‎లోని పాముల బస్తిలో జన్మించారు. ఈయన తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి సాహిత్య పీఠంలో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పని చేశారు. సుమారు 100 మందికి పైగా విద్యార్థులకు గైడ్‎గా వ్యవహరించారు. 
 
కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు, తెలుగు యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులు, తెలుగు సలహా మండలి సభ్యుడు, తెలుగు అకాడమీ సభ్యుడు, ప్రసిద్ధ హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాల అనువాదకుడుగా వ్యవహరించారు. 
 
ప్రస్తుతం హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్‎గా పని చేస్తున్నారు. దళిత బహుజన్ ఫ్రంట్ తో సన్నిహితంగా వ్యవహరించారు.