ప్రపంచ వ్యాప్తంగా సోదరభావం వ్యాప్తి చేస్తున్న భారత్ 

శాంతిని ప్రేమించే దేశమైన భారతదేశం ప్రపంచవ్యాప్తంగా సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని  ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలకే డా. మోహన్ భగవత్ తెలిపారు. అగర్తలాలో ఆయన బుధవారం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. 

జనవరి 24 నుండి నాలుగు రోజుల పర్యటన కోసం త్రిపురలో ఉన్న భగవత్, భారతదేశ జాతీయ జెండా పైభాగంలో ఉన్న కాషాయ రంగు ధైర్యం, త్యాగం,   ఉత్సాహాన్ని వర్ణిస్తుందని చెప్పారు.  దేశంలోని పురాతన రాజుల జీవితం,  తాత్విక చింతనాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులలో కూడా అటువంటి గుణాలు కనిపిస్తాయని తెలిపారు. 

 
డాక్టర్ భగవత్ మన జాతీయ జెండాలోని  ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యతను దేవి లక్ష్మికి కట్టుబడి ఉన్న పురోగతికి చిహ్నంగా వివరించారు. “భారతదేశం పురాతన కాలం నుండి ఆధ్యాత్మిక దేశంగా ఉన్నందున, జెండా మధ్యలో ఉన్న ధర్మచక్రం భారతదేశ ప్రజలు అనుసరించిన,  ఆచరిస్తున్న సామాజిక-సాంస్కృతిక తత్వశాస్త్రం ప్రాముఖ్యతను వర్ణిస్తుంది” అని చెప్పారు.

భారతదేశం ప్రకృతిని ఆరాధిస్తుందని అగర్తలలోని ఖేర్‌పూర్ సేవా ధామ్‌లో జరిగిన కార్యక్రమంలో పేర్కొన్నారు.  ప్రజాస్వామ్యంకు  నిజమైన అర్థంలో భారతదేశపు  పురాతన రాజ్యాల జీవితం, తాత్విక ఆలోచనలలో చూడవచ్చని చెప్పారు. 
 “భారతదేశపు పురాతన గణరాజ్యాలు అప్పటి ప్రజల జీవితం, తాత్విక ఆలోచనలలో  తత్వశాస్త్రంలో ప్రజాస్వామ్యపు నిజమైన భావం చిత్రీకరించబడింది. భారతదేశంలో నేటి ప్రజాస్వామ్యం బైశాలి, లిచాబి వంటి ప్రాచీన గణరాజ్యాల ప్రజాస్వామ్య వ్యవస్థ  భావనతో మెరుగుపరచుకోవాలి” అని వివరించారు.