ఒక వేళ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమెకు తన తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తిపై.. తండ్రి వారసులు అందరికీ సమాన హక్కు ఉంటుంది. అదే మహిళకు భర్త, అత్త, మామల ద్వారా వచ్చిన ఆస్తులపై వీలునామా లేకపోతే.. భర్త వారసులకు హక్కులు లభిస్తాయి అని ధర్మాసనం పేర్కొంది.
మద్రాసు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దాఖలైన ఆ పిటిషన్ పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఒక వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే సొంత కుమార్తెకు ఆస్తులపై హక్కు ఉంటుందా? లేదంటే అతని సోదరుని పిల్లలకు హక్కు ఉంటుందా? అన్న సందిగ్ధాన్ని కోర్టు పరిష్కరిస్తూ ఈ తీర్పును వెలువరించింది.
తమిళనాడుకు చెందిన ఈ కేసుకు సంబంధించి మార్చి 1, 1994లో ట్రయల్ కోర్టు తీర్పు ఇవ్వగా, ఈ తీర్పును హైకోర్టు సైతం సమర్థించింది. ఇక ఆర్డర్ డేట్ 21, 2009న జారీ చేసింది హైకోర్టు. ఇప్పుడు ఆ తీర్పును పక్కనపెడుతూ సుప్రీంకోర్టు తీర్పు కీలక వెలువరించింది. జస్టిస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ కృష్ణ మురారి ఆధ్వర్యంలోని బెంచ్.. ఈ తీర్పు కోసం 51 పేజీల తీర్పు కాపీని సిద్ధం చేయడం విశేషం.
More Stories
30 మంది ఉద్యోగులను తొలగించిన ఎయిర్ఇండియా
100కు పైగా ఎయిరిండియా విమానాల రద్దు
దేశంలోనే తొలి ప్రైవేటు రైలు జూన్ 4 నుంచి