కాగా 2021-22 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్యవిద్య ప్రవేశాల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాను అమలు చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం 2021 జులైలో నోటిఫికేషన్ జారీచేసిన విషయం తెలిసిందే. అయితే కొంతమంది అభ్యర్థులు ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రభుత్వం ఎలాంటి శాస్త్రీయ అధ్యయనం చేపట్టకుండానే, ఈడబ్ల్యూఎస్ కోటాను వర్తింపజేసేందుకు రూ.8 లక్షల వార్షికాదాయ పరిమితిని ప్రమాణంగా విధించిందని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ అకడమిక్ సెషన్ నుంచి ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను అమలు చేయరాదని, ఈ కారణంగా నీట్ పీజీ కౌన్సిలింగ్ జాప్యమవుతుండటాన్ని నిరసిస్తూ వైద్యులు ఆందోళనలు చేస్తున్నారు.
మరోవైపు ప్రస్తుత కౌన్సిలింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. ఈ కేసు తుది తీర్పునకు లోబడి భవిష్యత్తు రిజర్వేషన్ల అర్హతలు ఆధారపడి ఉంటాయని పేర్కొంది. ఈ కేసు తుది విచారణ మార్చి చివరి వారంలో చేపడతామని సుప్రీంకోర్టు పేర్కొంది.
More Stories
ఐఐటీల్లో 40 శాతం మందికి ఉద్యోగాల్లేవు
సందేశ్‌ఖాలీ కేసులో సిబిఐ తొలి ఎప్ఐఆర్
ఎన్నికల కమిషన్ ను నియంత్రించలేం