వైద్యులు, నర్సులు, హెల్త్‌కేర్ వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, తదితరులు ఈ సంక్షోభ సమయంలో నిర్వహించిన పాత్రను మోదీ ప్రశంసించారు. వీరంతా అసాధారణ సేవలు అందజేశారని ప్రశంసించారు. మారుమూల ప్రాంతాల్లో ప్రజలకు టీకాకరణ జరుగుతున్న దృశ్యాలు, హెల్త్‌కేర్ వర్కర్స్ టీకాలను అక్కడికి తీసుకెళ్తున్న దృశ్యాలు మన మనసులు, హృదయాలు గర్వంతో నిండిపోయేలా చేస్తున్నట్లు తెలిపారు.
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ సందర్భంగా ఇచ్చిన ట్వీట్లో, దేశ జనాభానుబట్టి చూసినపుడు టీకాకరణ అసాధ్యంగా కనిపించిందని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బలమైన నాయకత్వంలో ఇది సాధ్యమైందన్నారు. దేశ జనాభాలో దాదాపు 92 శాతం మంది టీకాలు పొందారని తెలిపారు.
దాదాపు 156 కోట్ల మందికి టీకాలు ఇచ్చినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించేవారికి 99 కోట్ల డోసులు ఇచ్చినట్లు చెప్పారు. వయోజనుల్లో 70 శాతం మంది టీకాలు పూర్తిగా (రెండు డోసులు) పొందారని పేర్కొన్నారు. 3 కోట్ల మందికి పైగా బాలలు మొదటి డోసు పొందినట్లు చెప్పారు. కోవిడ్-19పై పోరాటానికి భారత దేశం నాయకత్వం వహిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు.

More Stories
రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్న వినేశ్ ఫొగాట్
తిరువనంతపురం, కోచి, కన్నూర్, త్రిసూర్ లలో హంగ్ మున్సిపాలిటీలు!
కర్ణాటకలో డ్రగ్స్ నేరాలకు పాల్పడితే కూల్చివేతలే!