మమతా- మేనల్లుడి విబేధాలు ఓ నాటకం

పశ్చిమ బెంగాల్ బిజెపి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  ఆమె మేనల్లుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి  అభిషేక్ ల మధ్య కరోనా  ప్రోటోకాల్ విధించడం, గంగా సాగర్ వద్ద మకర సంక్రాంతి మేళా నిర్వహించడంపై విభేదాలు తలెత్తిన్నట్లు వచ్చిన  కధనాలు ఓ   నాటకం తప్ప మరొకటి కాదని బిజెపి స్పష్టం చేసింది.

బిజెపి యువమోర్చా అధ్యక్షుడు డాక్టర్ ఇంద్రనీల్ ఖాన్   స్పందిస్తూ, “వాళ్ళ మధ్య తేడా లేదు. ఇది మొత్తం డ్రామా” అని కొట్టిపారవేసారు. కరోనా పరిస్థితి పట్ల అభిషేక్‌కు అంత ఆందోళన ఉంటే, డిసెంబర్ 31న వేలాది మంది హాజరైన న్యూ ఇయర్ బాష్‌ను ఎందుకు నిర్వహించారని ఖాన్ ప్రశ్నించారు. ఇది ఇమేజ్ మేక్ఓవర్ ప్రయత్నం మాత్రమే అంటూ తెలిపారు.

గంగా సాగర్‌లో మకర సంక్రాంతి మేళాకు మమతా బెనర్జీ ఆమోదముద్ర వేయగా, అన్ని మతపరమైన,  రాజకీయ కార్యకలాపాలను నిలిపివేయాలని అభిషేక్ పిలుపునిచ్చారని ఆంగ్ల వార  పత్రిక ది వీక్ నివేదించింది. కరోనాను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారని కూడా పేర్కొన్నది.

బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ ది వీక్‌తో మాట్లాడుతూ, “ఇది వారి కొత్త వ్యూహమని నేను భావిస్తున్నాను. మేనల్లుడు తనను తాను కఠినమైన కార్యకర్తగా చిత్రీకరించుకొంటూ,  పిషి (అత్త, అంటే, మమత) ఉదారవాదిగా కనిపించే ప్రయత్నం వారు గత 10 సంవత్సరాలుగా బెంగాల్ ప్రజల ముందు చేస్తున్నారు.” అని స్పష్టం చేశారు.

పశ్చిమ బెంగాల్‌లో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ప్రజలు రాజకీయ నాయకులకు తలుపులు మూసివేస్తున్నారని ఘోష్ ధ్వజమెత్తారు. “మా కార్యకర్తలు కూడా ఓటర్లకు కరపత్రాలు ఇవ్వలేకపోయారు. వారు తమ తలుపులు మూసివేశారు. చాలా తక్కువ మంది బయటకు వచ్చి ఓట్లు వేస్తారు. మిగిలిన ఓట్లను టిఎంసి వారు రిగ్ చేసుకుంతయారు” అంటూ విమర్శించారు.

 
హౌరా, బిధాన్‌నగర్, అసన్సోల్ కార్పొరేషన్లకు ఈ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా భారీ సభలను బీజేపీ రద్దు చేసిందని ఖాన్ తెలిపారు. “బదులుగా, మేము ప్రజల ఇంటి వద్ద ఆహారం,  మందులతో ఉంటాము” అని చెప్పారు.