
మరోసారి హద్దు మీరిన డ్రాగన్ సైన్యం గాల్వన్ లోయలో జనవరి 1న తమ జాతీయ జెండా ఎగురవేసిన్నట్లు వచ్చిన కథనాలను భారత సైన్యం తిప్పికోట్టింది. చైనా సైన్యం జెండా ఎగుర వేసిన ప్రదేశం వివాదాస్పద ప్రాంతం కాదని ఆర్మీ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
చైనా అధీనంలోని ప్రదేశంలోనే పతాకావిష్కరణ జరిగిందని భారత సైన్యం తెలిపింది. కాగా, వివాదాస్పద ప్రదేశం నుంచి ఇరుపక్షాలు 2 కిలోమీటర్ల వెనక్కి వెళ్లాలని గతంలోనే భారత్-చైనా అంగీకరించిన సంగతి తెలిసిందే.
అయితే తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లో రెచ్చగొట్టే చర్యలలో భాగంగానే ఇటువంటి కధనాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కనిపిస్తున్నది. దీనికి సంబంధించిన వీడియోను ఆ దేశ అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ ట్వీట్ చేసింది. ఈ జాతీయ జెండా చాలా ప్రత్యేకమని.. ఒకప్పుడు బీజింగ్‌లోని తియానన్మెన్ స్క్వేర్‌పై ఎగిరిందని చైనా అధికార మీడియా ప్రతినిధి షెన్ షివీ ట్వీట్ చేశారు.
ఆసక్తికరమైన విషయమేమిటంటే, సరిహద్దులోని 10 ప్రదేశాలలో భారతీయ సైనికులు తమ చైనా సైనికులతో శుభాకాంక్షలు తెలుపుకొంటూ, స్వీట్లు మార్పిడి చేసుకున్న రోజునే ఈ రెచ్చగొట్టడం జరిగింది, ఇరు దేశాల మధ్య సంక్లిష్టమైన సంబంధాల కోసం మరోసారి రెచ్చగొట్టే చర్యలకు దిగింది.
గాల్వన్ లోయలో చైనా జెండా వార్తలపై విపక్షాలు నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. డ్రాగన్‌కు దీటుగా బదులివ్వాలని, ప్రధాని మోదీ ఇప్పటికైనా మౌనం వీడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్‌సింగ్ సుర్జేవాలా మాట్లాడుతూ.. గల్వాన్ లోయలో రెపరెపలాడాల్సింది త్రివర్ణ పతాకం ఒక్కటే అని స్పష్టం చేశారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా