టీఎంసీ త్రిపుర, గోవాల రాష్ట్రాల వైపు చూడటం కాదని, ముందుగా బెంగాల్ అభివృద్దిపై దృష్టిపెట్టాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టిఎంసి అధినేత్రి మమతా బనెర్జీకి బీజేపీ ఉపాధ్యక్షుడు దిలీప్ ఘోష్ హితవు పలికారు. గోవా, త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి టీఎంసీ దేశవ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నిస్తున్న మమతపై ఆయన విరుచుకు పడ్డారు.
పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రతిష్టాత్మంగా భావించే.. ‘దువారే సర్కార్’ పథకం ప్రారంభం కావాల్సింది కాస్త నిధుల కొరత కారణంగా రద్దయిందని ఆయన ఆరోపించారు. ప్రణాళికలు, నిధుల కొరత వల్ల ప్రాజెక్టులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ధ్వజమెత్తారు.
టీఎంసీ జనరల్ సెక్రటరీ అభిషేక్ బెనర్జీ త్రిపుర పర్యటనపై వమండిపడుతూ టీఎంసీ త్రిపురలో ఏం చేయలేదని, అభిషేక్ బేనర్జీ అక్కడి వెళ్లడం దండగని ఎద్దేవా చేశారు. టీఎంసీ త్రిపురలో తన ఉనికిని నిలుపుకోలేదని అక్కడి ప్రజలు స్పష్టం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజలు ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా చూసుకోవాలని ఆయన మండిపడ్డారు.

More Stories
జబల్పూర్లో ఆర్ఎస్ఎస్ కార్యకారిణి సమావేశాలు ప్రారంభం
బీహార్ లో ప్రతిపక్షం గెలిస్తే పిఎఫ్ఐ కార్యకర్తలను జైల్లోనే ఉంచుతారా?
ఛత్తీస్గఢ్లో మరో 51 మంది నక్సలైట్లు లొంగుబాటు