
విజయవాడలో బిజెపి జరిపిన ప్రజాగ్రహ సభ ఘనంగా విజయవంతం కావడంతో రాష్ట్రంలో ఇక వైసిపి పతనం ప్రారంభమైన్నట్లే అని బిజెపి ఎంపీ జివిఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని వైసీపీ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న అసంతృప్తికి ఇదొక్క మేలుకొలుపు అని తెలిపారు.
ఈ సభపై రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి `బిజెపి పట్ల జాలి’ చూపించడం గమనిస్తే ఆయన మాటలలో భయం కనిపిస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. బీజేపీ నిర్వహించిన సభతో తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆయన తెలిపారు.
టిడిపి వ్రాసిన స్క్రిప్ట్ ప్రకారమే అక్కడ బిజెపి నేతలు మాట్లాడారని అంటూ రామకృష్ణారెడ్డి పేర్కొనడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరో మాట్లాడిస్తే మాట్లాడాల్సిన దుస్థితి బీజేపీకి లేదని అంటూ సజ్జల వ్యాఖ్యలని ఖండించారు.
అవినీతి తోలు తీసే పార్టీ ఒక్క బీజేపీ నేనని జీవీఎల్ స్పష్టం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బురదజల్లే కార్యక్రమాన్ని విరమించుకోకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో నిన్నటి సభతో తేటతెల్లమైందని చెప్పారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ