 
                జమ్ము కాశ్మీర్లో బుధవారం సాయంత్రం జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఇద్దరు పాకిస్తానీయులతో పాటు ఆరుగురు ఉగ్రవాదులు మరణించినట్లు అధికారులు తెలిపారు. అనంతనాగ్, కుల్గామ్ జిల్లాల్లో ఈ ఎన్కౌంటర్లు జరిగినట్లు వెల్లడించారు.
అనంతనాగ్ జిల్లాలోని నౌగమ్, కుల్గామ్ జిల్లాలోని మిర్హామ్ గ్రామాల్లో ఉగ్రవాద నిరోధక చర్యల్లో భాగంగా భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. అదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులకి దిగాయని పేర్కొన్నారు.
అనంతనాగ్ జిల్లాలోని నౌగమ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక జవానుకి గాయాలు కాగా, నలుగురు ఉగ్రవాదులు మరణించినట్లు కాశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజరు కుమార్ తెలిపారు. ఆవెంటనే కుల్గామ్‌లోని మిహ్రామ్గ్రామంలో జరిగిన మరో ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారని చెప్పారు. ఈ ప్రాంతంలో మరో ఉగ్రవాది ఉన్నట్లు అనుమానిస్తున్నామని చెప్పారు.
వీరిలో నలుగురు నిషేధిత జెఇఎం ఉగ్రవాద సంస్థకు చెందినవారు కాగా, మరో ఇద్దరు ఏ సంస్థకు చెందినవారో గుర్తించాల్సి వుందని అన్నారు.





More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు