
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పిఎంకిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం వెల్లడించింది. ఈ నిధుల్ని జనవరి 1న జమ చేయనున్నట్టు వెల్లడించింది.
ఈ పథకానికి సంబంధించి 10 వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 1న మధ్యాహ్నం 12.30 గంటలకు వీడియో కాన్ఫరెన్సు ద్వారా విడుదల చేస్తారని పిఎంవొ తెలియచేసింది. ఈ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా దాదాపు 10 కోట్ల రైతు కుటుంబాల ఖాతాల్లో రూ. 20 వేల కోట్లకు పైగా సొమ్మును జమ చేయనున్నట్టు పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి రైతు లబ్దిదారులతో సంభాషించనున్నారు. పీఎం-కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతు కుటుంబాలకు, నాలుగు నెలలకు ఒకసారి రూ.2వేల చొప్పున మూడు సమాన వాయిదాల్లో ఏడాదికి రూ.6 వేల మేర ఆర్థిక ప్రయోజనాన్ని కేంద్రం అందిస్తోంది.
ఈ నిధి నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఇంతవరకు మొత్తం 1.6 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నగదును రైతు కుటుంబాలకు బదిలీ చేశారు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు