
ప్రాచీన స్మారక కేంద్రాలు వివిధ సంస్థలకు దత్తత ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం నిర్ణయించిందని, దేశ వ్యాప్తంగా వెయ్యి స్మారక ప్రాంతాలను దత్తత ఇవ్వబోతున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి వెల్లడించారు. విదేశాల కంటే మంచి పర్యాటక కేంద్రాలు దేశంలో చాలా ఉన్నాయని, పర్యాటక ప్రాంతాల్లో సదుపాయాలు పెంపొందిస్తామని ఆయన తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్ లో భాగ్య నగర్ వైశ్య యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టా కార్యక్రమంలో పాల్గొంటూ పరేడ్ గ్రౌండ్ లో రెండు రోజుల పాటు జరగనున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫియెస్టాను ప్రారంభించిన ఆయన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ చేశారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో టూరిజం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందని చెప్పారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల దేశంలో టూరిజం కార్యక్రమాలు చాలా వరకు ఆగిపోయాయని, ప్రపంచ వ్యాప్తంగా కరోనా వల్ల టూరిజం నష్టపోయిందని కేంద్ర మంత్రి గుర్తు చేశారు.
మన దేశంలో టూరిజం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉందని, ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో న్యూజిలాండ్ దేశంలోని పర్యాటక ప్రాంతాలకంటే దీటైన మంచి ప్రదేశాలు చాలా ఉన్నాయని తెలిపారు. పర్యాటక ప్రాంతాల్లో సరైన సదుపాయాలు కల్పిస్తామని చెబుతూ దేశంలో ఉన్న వెయ్యి స్మారక కట్టడాలను వివిధ సంస్థలు దత్తత చేసుకోవడానికి ఇస్తున్నామని పేర్కొన్నారు.
రామప్ప యునెస్కో గుర్తింపు పొందిందని, పోచంపల్లి ని బెస్ట్ టూరిజం విలేజ్ కింద యునెస్కో గుర్తించిందని గుర్తు చేశారు. పోచంపల్లి లో ఫిబ్రవరి 25 న టూరిజం డే సందర్భంగా వివిధ కార్యక్రమాలు చేస్తామని చెప్పారు.
More Stories
రెండు గంటల్లో హైదరాబాద్ – విజయవాడ ప్రయాణం!
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు