లాభాలు ఆశించి పెట్టుబ‌డులు పెడితే అధిక రిస్క్

అధిక లాభాలు ఆశించి వివిధ ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెట్టే మ‌దుప‌ర్లు జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత దాస్ హెచ్చ‌రించారు. అధిక లాభాల కోసం ఆయా ప‌థ‌కాల్లో పెట్టుబ‌డులు పెడితే హైరిస్క్‌లు (అధిక ప్ర‌మాదాలు) పొంచి ఉన్నాయ‌ని వారించారు. ఇటీవ‌లి కాలంలో అధిక లాభాలు ఆశించి క్రిప్టో క‌రెన్సీల్లో భార‌తీయులు భారీగా పెట్టుబ‌డులు పెట్టార‌ని వార్త‌లొస్తున్న నేప‌థ్యంలో శ‌క్తికాంత దాస్ వ్యాఖ్య‌ల‌కు ప్రాధాన్యం ఏర్ప‌డింది.

గ్యారెంటెడ్ టైంబౌండ్ డిపాజిట్ ఇన్సురంచె పేమెంట్ సదస్సులో  మాట్లా డుతూ ప్రపంచ  ఆర్థిక వ్యవస్థకు  భారతదేశం దిక్సూచిలా  మారే సమయం  వచ్చిందని ఆయన చెప్పారు. అయితే బ్యాంకింగ్ రంగంలోని అన్ని విభాగాలు ఉమ్మ‌డిగా ప‌ని చేస్తే సాధ్యమని స్పష్టం చేశారు.

 బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ దృఢంగా, నిల‌క‌డగా ముందుకు సాగేందుకు బ్యాంకుల్లో కార్పొరేట్ సుప‌రిపాల‌న మార్గ‌ద‌ర్శ‌కాల బ‌లోపేతానికి ఆర్బీఐ చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని తెలిపారు. ఇటీవ‌ల బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ రెండు కీల‌క మైలు రాళ్లు దాటింది. 27 ఏండ్ల అంత‌రాయం త‌ర్వాత బ్యాంకుల్లో డిపాజిట్ల‌పై బీమా ప‌రిమితిని రూ. ల‌క్ష నుంచి రూ.5 ల‌క్ష‌ల‌కు పెంచాయి.

1993లో దాని ప‌రిమితి రూ.ల‌క్ష‌గా నిర్ణ‌యించింది. డిపాజిట్ చేసిన 90 రోజుల్లో బ్యాంకులు వారికి గ్యారంటీ క‌ల్పించాయి అని శ‌క్తికాంత దాస్ చెప్పారు.