
సంగీత సినీ వినీలాకాశంలో మూడున్నర దశాబ్దాల పైగా వేలాది పాటలు రాసిన కలం మూగబోయింది. ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు.వేటూరి సుందర రామ్మూర్తి తర్వాత ఆ స్థాయిలో తెలుగు పాటకు గౌరవం తీసుకొచ్చిన కవి ఈయన.
అత్యంత సరళమైన పదాలతో వాడుకభాషలో ఈయన రాసిన ఎన్నో వందల పాటలు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో అలాగే నిలిచిపోయాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఈ నెల 24న కిమ్స్ ఆస్పత్రిలో చేరారు. నవంబర్ 30 సాయంత్రం మరణించారు. అప్పటి నుంచి ఐసీయూలోనే ఉన్నారు.
అయితే ఆయన ఆరోగ్యానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని.. త్వరగానే కోరుకుంటున్నారని రెండు రోజుల కింద కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ మంగళవారం మధ్యాహ్నం నుంచి సిరివెన్నెల ఆరోగ్య ఒక్కసారిగా విషమించింది. వైద్య బృందం ప్రతిక్షణం ఆయనను కాపాడటానికి ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది.
సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చంబోలు సీతారామశాస్త్రి. 1955 మే 20న విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో డాక్టర్. సి.వి.యోగి సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన ఆయన పదో తరగతి వరకూ అనకాపల్లిలోనే చదివారు. కాకినాడలో ఇంటర్, ఆంధ్రా విశ్వకళా పరిషత్‌లో బి.ఎ.పూర్తి చేశారు.
సీతారామశాస్త్రికి ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు. అనకాపల్లిలోని మున్సిపల్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆంధ్రా మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరారు. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేశారు. అనంతరం అనకాపల్లిలోని బీఎస్ఎన్ఎల్ శాఖలో ఉద్యోగంలో చేరారు.
ఆ సమయంలో ఆర్‌ఎస్ఎస్‌లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక, దేశభక్తి గీతాలు రాయడం సీతారామశాస్త్రికి అలవాటు. అనేక కార్యక్రమాల్లో సైతం సొంతంగా పాటలు రాసి అలపించేవారు.
1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలిసే అవకాశం సీతారామశాస్త్రికి దక్కింది. ఆ సమయంలో సీతారామశాస్త్రిని ప్రతిభను కె.విశ్వనాథ్ గుర్తించారు. ఆయన చిత్రంలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. అలా తొలిసారి సిరివెన్నెల సినిమాలో పాటలు రాసే అవకాశాన్ని సీతారామశాస్త్రి దక్కించుకున్నారు.
ఆ సినిమాలో ఆయన రాసిన పాటలు ఎంతగానో పాపులర్ అయ్యాయి. దీంతో ఆ సినిమా పేరే సీతారామశాస్త్రి ఇంటి పేరుగా మారింది. విధాత తలపున ప్రభవించినది.. సిరివెన్నెల రాసిన తొలి పాట. చివరిసారిగా.. అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ చిత్రంలో చిట్టు అడుగు అనే పాట రాశారు.
తొలి గీతం ‘సిరివెన్నెల’లోని విధాత తలపున’ కే నంది అవార్డు దక్కించుకున్న ఘనత ఆయనది. 3000లకు పైగా పాటలు రాసిన ఆయనకు పదమూడు సార్లు నంది అవార్డ్ వరించింది. ఉత్తమ గేయ రచయితగా నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. పలు సినిమాల్లో ఆర్టిస్ట్‌గానూ మెరిశారు. సాహిత్యరంగానికి ఆయన చేసిన సేవలకుగానూ 2019లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
More Stories
ఉగ్రదాడి కారకులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు
కర్రెగుట్టలో చివరి ఘట్టంలో ఆపరేషన్ కగార్?
కాళేశ్వరంలో అవినీతి అనకొండ హరిరామ్ అరెస్ట్