
ఈ క్రమంలోనే దేశాల వారీ ఆంక్షలను తొలగించి, ప్రధానంగా వ్యాక్సినేషన్ ఆధారంగా ఆంక్షలు విధించాలని బైడెన్ నిర్ణయించారు. తాజా ఉత్తర్వుల ప్రకారం 18 ఏళ్లలోపు వారు, వైద్య సమస్యలు ఉన్న వారు వ్యాక్సిన్ తీసుకోకపోయినా అమెరికాలోని అనుమతిస్తారు.
అలాగే దేశవ్యాప్తంగా 10 శాతం కన్నా తక్కువ వ్యాక్సినేషన్ పూర్తి చేసిన 50 దేశాల నుంచి వచ్చే నాన్-టూరిస్టులు కూడా వ్యాక్సిన్ తీసుకోకుండా అమెరికాలో ప్రవేశించడానికి అర్హులే. అయితే ఈ అనుమతి కావాలంటే 60 రోజుల కన్నా ఎక్కువ కాలం అమెరికాలో ఉండకూడదు. అలా ఉండాలంటే కచ్చితంగా వ్యాక్సిన్ తీసుకోవలసిందే.
ఈ కొత్త నిబంధనలను ప్రయాణికులందరికీ తెలియజేయాలని విమానయాన సంస్థలకు బైడెన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ధ్రువీకరించుకోవాలని చెప్పింది. అలాగే అంతర్జాతీయ ప్రయాణికులందరూ కూడా విమానం ఎక్కే72 గంటల్లోపు కరోనా టెస్టు చేయించుకొని నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది.
వ్యాక్సిన్ తీసుకోకుండా ప్రయాణించడానికి అనుమతి తీసుకున్న వ్యక్తులు ప్రయాణానికి 24 గంటల్లోపే కరోనా టెస్టు చేయించుకొని రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అమెరికా రెగ్యులేటరీలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ వ్యాక్సిన్ తీసుకున్నా సరిపోతుందని అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పేర్కొంది.
More Stories
భారత్ను చైనాకు దూరం చేసి అమెరికాకు దగ్గర చేసుకోవడమే
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్లో చీలిక!
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి