కాల్పులు జరిగిన సమయంలో మరో ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. అయితే దొరికిన ఎస్‌ఎల్‌ఆర్ వేపన్ కీలక నేతలు మాత్రమే వాడే అవకాశం ఉండటంతో పోలీసుల అనుమానిస్తున్నారు. .
చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా తెలంగాణ సరిహద్దులోకి ఎంట్రీ అయ్యాడని వార్తల నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. చర్ల, వాజేడు, వెంకటాపురం అటవీ ప్రాంతంలో కుంబింగ్ కొనసాగుతోంది.
తెలంగాణ పోలీస్, గ్రే హౌండ్స్ దళాలు కలిసి కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో బీజాపూర్, ములుగు సరిహద్దులోని తర్లగూడ వద్ద మావోయిస్టులు పోలీసులకు తారసపడ్డారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

More Stories
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచి రైతులు విలవిల