
వచ్చే ఏడాది ప్రారంభంలో జరుగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా తామే గెలుస్తాని బీజేపీ ఓబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు డా కె లక్ష్మణ్ భరోసా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని, అయితే మెజారిటీ అటు ఇటు ఉండవచ్చని చెప్పారు. రాష్ట్ర మంత్రులు ఈ ఎన్నిక చిన్నది అంటూనే భయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
తెలంగాణాలో బీజేపీ పార్టీ బలపడుతోందని చెబుతూ టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే నని స్పష్టం చేశారు. అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని, బడుగు బలహీన వర్గాలకు బీజేపీ ప్రభుత్వంలో పెద్దపీట వేసిందని తెలిపారు. ఇన్నేళ్లలో ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయలేని విధంగా సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందని పేర్కొన్నారు.
ఓబీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెబుతూ 27 శాతం రిజర్వేషన్లు వర్తించేలా కేంద్రం చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు. ఓబిసి మేళాలను ఢిల్లీతో సహా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ నెల 22న ఓబీసీ మేధావుల సదస్సు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
బూత్ వారీగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటూ, ఇందులో భాగంగా వ్యాక్సినేషన్ పక్రియను జాతీయ పండుగగా నిర్వహించుకోవాలని పిలుపిచ్చారు.
More Stories
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కార్!
ముగ్గురు మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు
హైకోర్టు స్టేకు కాంగ్రెస్ కారణం.. వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలి