ఈ పథకం ప్రకారం ఎవరైనా రోడ్డు ప్రమాదానికి గురైతే, వారిని ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి తరలించి కాపాడితే వారికి ఈ పథకం కింద రూ. 5,000 బహుమతిగా ఇస్తారు.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడిన వారికి ఇది ఇతోధికంగా ప్రేరణనిస్తుంది. రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ 2020 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 3,66,138 రోడ్డు ప్రమాదాలు జరిగాయని పార్లమెంటుకు తెలిపింది. వాటిలో 1,31,714 మంది చనిపోయారని కూడా తెలిపింది.
గుడ్ సామరిటన్ పథకం కింద రోడ్డు ప్రమాదంలో మెదడు, వెన్నెముక గాయాలయిన వారిని రక్షించిన వారికి నగదు బహుమతి లభిస్తుందని ఎడిజి తెలిపారు. అయితే ప్రాంతీయ రవాణా అధికారి(ఆర్‌టిఒ), ప్రధాన ఆరోగ్య అధికారి, పోలీస్ సూపరింటెండెంట్, కలెక్టర్‌తో కూడిన కమిటీ కేసులను పరిశీలించి ఈ రివార్డులు ఇస్తుందన్నారు.
మోటార్ చట్టం సెక్షన్ 2(12ఎ) కింద గోల్డెన్ అవర్ అంటే ప్రాణాలు కాపాడేందుకు అవకాశం ఇచ్చే చివరి గంట సమయం అని ఓ సీనియర్ పోలీస్ అధికారి వివరించారు. ఒకవేళ ఇద్దరు కలిసి కాపాడితే బహుమతిని ఇద్దరికి చెరి సగం ఇస్తారు.
ప్రతి ఏడాది జాతీయ స్థాయిలో కూడా గుడ్ సామరిటన్స్ కింద కొందరిని ఎంపిక చేసి రివార్డులు ఇస్తారని, ఆ అవార్డు కింద రూ. లక్ష, ఓ ప్రశంసా పత్రం, ట్రోఫీని ఇస్తారని కూడా మధ్యప్రదేశ్ రోడ్ సేఫ్టీ ఎడిజి తెలిపారు.
More Stories
సర్వేల పేరుతో ఓటర్ల వివరాలు సేకరిస్తే చర్యలు
సప్తపదితో ముడిపడినదే హిందూ వివాహం
మే 4 నుంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు