ఎన్‌కౌంటర్‌లో జైషే కమాండ్‌ హతం

జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాదుల ఏరి వేత కొనసాగుతున్నది. అవంతిపోరాలోని తిల్వాని మొహల్లా వద్ద బుధవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతుడిని జైషే మహ్మద్‌ కమాండర్‌ షామ్‌ సోఫీగా గుర్తించారు.

 ప్రస్తుతం ఇంకా ఆపరేషన్‌ కొనసాగుతున్న అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాక్కున్నట్లుగా భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఈ ప్రాంతంలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు.

కార్డన్‌ను సెర్చ్‌ పకడ్బందీగా నిర్వహించేందుకు మరిన్ని బలగాలను పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. గత మూడు రోజుల్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరుగడం ఇది ఆరోసారి.

 ఐదుగురు పాక్ ప్రేరేపిత జైష్ ఉగ్రవాదులు ఇటీవలే సరిహద్దులను దాటి భారత్ లో అడుగుపెట్టారు. ఐదుగురు సాధారణ పౌరులను చంపేశారు. హిందువులు, సిక్కులను లక్ష్యంగా చేసుకుని మారణహోమానికి పాల్పడ్డారు. 

దీంతో.. సైన్యం ఉగ్రవాదులను  ఏరివేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసింది. ఇటీవలి కాలంలో సైన్యం 10 మంది ఉగ్రవాదులను చంపేసింది. మంగళవారం పోషియాన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎల్‌ఈటీతో సంబంధాలున్న ఐదుగురు ఉగ్రవాదులను బలగాలు హతమార్చిన విషయం తెలిసిందే.