
వ్యాపారాలకు కంపెనీ సెక్రటరీలు ఇచ్చే సలహాలు చాలా భిన్నంగా ఉంటాయని, అయితే సుపరిపాలన, మంచి నిర్వహణ కల్గిన కంపెనీలు మాత్రమే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. గత ఏడాదిలో భారతీయ కంపెనీ అద్భుతమైన మంచి పనితీరును చూపి పెట్టుబడిదారులను ఆకర్షించాయని ఆమె కొనియాడారు.
కొద్ది సంవత్సరాల క్రితం ఇన్వెస్టర్ల అంచనాలను అందుకోలేక పోవడానికి కారణం కంపెనీలకు విధానపరమైన, ఇతర సమస్యలు ఉండడమే అని ఆమె చెప్పారు. ఇప్పుడు పారదర్శకత, మెరుగైన పాలన కారణంగా భారతీయ కంపెనీలు బాగా రాణిస్తున్నాయని ఆమె తెలిపారు. పెద్ద కంపెనీలు మాత్రమే కాదు, చిన్న కంపెనీలు కూడా మంచి పాలనతో ఆకర్షిస్తున్నాయని ఆమె వివరించారు.
కంపెనీ విస్తరణలో సెక్రటరీ పాత్ర, కంపెనీ మార్గదర్శకాలను పాటించడం వంటి వాటి మధ్య వ్యత్యాసం ఉందని సీతారామన్ పేర్కొన్నారు. కంపనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసిఎస్‌ఐ) 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీతారామన్ పాల్గొంటూ పురాతన చట్టాలను తొలగించి, కంపెనీల చట్టంలో శిక్షా నిబంధనలను తగ్గించేందుకు సవరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు.
అలాగే కంపెనీ సెక్రటరీ పని పరిధిని విస్తృతం చేయనున్నామని ఆమె చెప్పారు. 2020 నుంచి ఇప్పటి వరకు చూస్తే భారత్‌లో స్టాక్‌మార్కెట్ పట్ల ఆసక్తి చూపే రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతోందని ఆమె తెలిపారు. రిటైల్ ఇన్వెస్టర్ల నుంచి డబ్బు ప్రవాహం పెరుగుతోందని, అదే సమయంలో పెద్ద ఇన్వెస్టర్లు కూడా మంచి నిర్వహణ కల్గిన కంపెనీలకే మొగ్గుచూపుతున్నారని ఆమె వివరించారు.
‘స్టాక్‌మార్కెట్లోకి పెద్ద సంఖ్యలో మంది రిటైల్ వస్తున్నారు. విదేశాల నుంచి కంపెనీలు భారీగా నిధులను అందుకుంటున్నాయి. దీని కారణం మీరే (కంపెనీ సెక్రటరీలు), మీరిచ్చే మంచి సలహాలతో మెరుగైన కంపెనీలు రూపుదిద్దుకుంటున్నాయి’ అని ఆర్ధిక మంత్రి ప్రశంసించారు. గత రెండు సంవత్సరాల్లో కంపెనీ సెక్రటరీలు వ్యాపారాలకు సాధ్యమైనంత వరకు సామర్థం పెంచేందుకు సలహాలు ఇచ్చారని చెబుతూ ఇప్పుడు సాంకేతిక రూపంలో కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని ఆమె గుర్తు చేశారు.
More Stories
దేశంలోనే అత్యంత సంపన్న మహిళగా రోష్ని నాడార్
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో నటుడు విశాల్ బ్రహ్మ అరెస్ట్
తక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం .. ఎస్బీఐ అంచనా