
ముంబై సముద్ర తీరంలోని క్రూయిజ్ షిప్ లో జరిగిన రేవ్ పార్టీలో జరిగిన దాడిలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. క్రూయిజ్ పార్టీలో డ్రగ్స్ మహిళల శానిటరీ ప్యాడ్లలో లభించాయి.మాదకద్రవ్యాల నిరోధక బృందం (ఎన్సీబీ) దాడి చేసినపుడు క్రూయిజ్ లో డ్రగ్స్ ను మహిళల శానిటరీ ప్యాడ్లు, మెడిసిన్ బాక్సుల్లో కనుగొన్నారు.
బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తన లెన్స్ బాక్స్‌లో డ్రగ్స్ తీసుకెళుతున్నాడని ఎన్సీబీ అధికారులు చెప్పారు. ఆర్యన్ ఖాన్ పై ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ తీసుకోవడం, డ్రగ్స్ కలిగి ఉండటం వంటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ లోని నాలుగు సెక్షన్ల కింద కేసు పెట్టారు.
ముంబై కోర్టు ఆర్యన్ ఖాన్ తోపాటు మరో ఇద్దరిని అక్టోబర్ 4 వరకు పోలీసు కస్టడీకి పంపింది. ఆర్యన్ ఖాన్ వాట్సాప్ ఛాటింగుల్లో అతని స్నేహితులతో డ్రగ్స్ గురించి చర్చించారని ఎన్సీబీ అధికారులు స్పష్టం చేశారు. ఎండీఎంఏ, ఎక్టసీ, కొకైన్, ఎండీ, చరాస్ లాంటి భిన్న రకాల మాదకద్రవ్యాలు క్రూయిజ్ లో లభించాయి.
అయితే, తన క్లయింట్ ఆర్యన్‌ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ దొరకలేదని అతని తరపు న్యాయవాది సతీష్ మనేషిండే కోర్టుకు తెలిపారు. ఆర్యన్‌ఖాన్ క్రూయిజ్ పార్టీకి కేవలం అతిథిగా ఆహ్వానంపై వెళ్లాడని, అతని వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు కనుగొనలేదని వాదించారు. క్రూయిజ్ పార్టీ నిర్వాహకులతో తన క్లయింట్ ఆర్యన్ ఖాన్ కు ఎలాంటి సంబంధాలు లేవని న్యాయవాది సతీష్ కోర్టుకు వివరించారు.
సముద్రం మధ్యలో మూడు రోజుల మ్యూజికల్ నైట్‌లో భాగంగా నౌకలో ఎఫ్‌టీవీ ఇండియా ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్టు సమాచారం. నౌక ముంబై నుంచి గోవా వెళ్తున్నది. ఎఫ్‌టీవీ ఇండియా ఎండీ కషీఫ్ ఖాన్‌తో పాటు పార్టీ ప్లాన్ చేసిన కొంత మందికి ఎన్సీబీ సమన్లు పంపింది. పార్టీ శనివారం-ఆదివారం వరకు జరగాల్సి ఉంది. కానీ, పార్టీపై సమాచారం ఉండటంతో ఎన్సీబీ రైడ్ చేసింది.
ఎవరీ సమీర్ వాంఖెడే..?
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
భద్రతా దళాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి