ప్రస్తుత జపాన్ ప్రధాని యోషిహిడే సుగా ఏడాది గడవక ముందే పదవి నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు. మరోసారి బాధ్యతలు చేపట్టనని కూడా తెలిపారు. ప్రజాదరణ కోల్పోయిన సుగా పార్టీ నేతగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు.
ఈ నేపథ్యంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ (ఎల్‌డిపి) నూతన నాయకుడిని ఎన్నుకునేందుకు సంస్థాగత ఎన్నికలు నిర్వహించారు. ఇందులో అనేక మంది పోటీ చేసినప్పటికీ ప్యుమియో కిషిదాకే భారీ మద్దతు లభించింది. జపాన్ లో షింజో అబే చాలా కాలం ప్రధానిగా పనిచేశారు. అయితే ఆయన తన అనారోగ్య కారణంగా గత ఏడాది ఆగస్టులో పదవి నుంచి తప్పుకున్నారు. దాంతో యోషిహిడే సుగా బాధ్యతలు చేపట్టారు.
కానీ ఆయన పదవిని స్వీకరించినప్పటి నుంచి కోవిడ్ మహమ్మారి, ఒలింపిక్ క్రీడల నిర్వహణ వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటూ వస్తున్నారు. దీంతో ప్రజల్లో ఆయనపట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఏడాది కాలంలోనే ఆయన పనితీరు రేటింగ్ 30 శాతానికి తగ్గిపోయినట్లు తాజా సర్వేలో వెల్లడయింది.
ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ప్యుమియో కిషిదా ఎన్నికయ్యారు. ఆయన సంస్థాగత ఎన్నికల్లో వ్యాక్సినేషన్ మంత్రి టారో కోనోను ఓడించారు. ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో ప్యుమియో కిషిదా ఎన్నికయ్యారు. ఆయన సంస్థాగత ఎన్నికల్లో వ్యాక్సినేషన్ మంత్రి టారో కోనోను ఓడించారు.

More Stories
ఆరేళ్ల తర్వాత ట్రంప్, జిన్పింగ్ భేటీ.. 10 శాతం టారిఫ్ తగ్గింపు
థాయిలాండ్ కు పరారైన 500 మంది భారతీయులు
ఎన్నికల్లో పోటీచేస్తా.. లేకపోతే లక్షలాదిమంది బహిష్కరిస్తారు!