దేశంలోనే కీలకమైన భవానీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది. భారీ సాయుధ బలగాల భద్రత మధ్య భవానీపూర్ సెగ్మెంటులో పోలింగ్ సాగుతోంది.టీఎంసీ అభ్యర్థి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీపై బీజేపీకి చెందిన న్యాయవాది ప్రియాంక టిబ్రేవాల్ పోటీ పడుతున్నారు.
ప్రతిష్ఠాత్మక మైన భవానీపూర్ ఉప ఎన్నికల పోలింగ్ పర్వంలో కేంద్రం 15 కంపెనీల బలగాలను మోహరించింది. ‘‘కేంద్ర పారామిలటరీ బలగాల బందోబస్తు మధ్య ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా, స్వేచ్ఛగా సాగుతోందని భావిస్తున్నాను. నేను పోలింగ్ కేంద్రాలను సందర్శించాను, రాష్ట్ర ప్రభుత్వం భయపడుతోంది’’ అని బీజేపీ అభ్యర్థిని ఆశాభావం వ్యక్తం చేశారు.
భవానీపూర్ తో పాటు జంగిపూర్, షంషేర్ జంగ్ అసెంబ్లీ స్థానాల్లోనూ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్రంలోని పూరి జిల్లా పిప్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ భారీభద్రత మధ్య సాగుతోంది.

More Stories
ప్రజాస్వామ్యంలో పెరిగిపోతున్న వర్గ రాజకీయాలు
కేజ్రీవాల్ కోసం ఛండీగఢ్లో మరో శీష్ మహల్
స్వామి దయానంద సరస్వతి దార్శనికుడు